
Hinduism and beliefs / హిందూత్వం – నమ్మకాలు
1. హిందూత్వం – నమ్మకాలు
హిందూ ధర్మం ఎప్పుడూ గుడ్డిగా దేనినీ నమ్మమని చెప్పలేదు. అస్పష్టమైన విషయాలను నిజం అనుకుని అజ్ఞానం లో బతకమని చెప్పనూ లేదు. విద్యనూ విజ్ఞానాన్నీ ప్రతిబింబించేదే హిందూత్వం. అందుకే భారత దేశాన్ని ప్రపంచ విజ్ఞాన భాండాగారం అంటారు. మరి ఇంత విజ్ఞానానికి మూలం ఏది? ప్రపంచం అక్షరాలు దిద్దుకోకముందే మన ఋషులు ఖగోళ శాస్త్రాన్నీ, యోగాన్నీ, తంత్ర మంత్రాలనూ, వైద్యాన్నీ, గణితాన్నీ ఎలా ఔపోసన పట్టగలిగారు? గుడ్డిగా భగవంతుణ్ణి పూజించే వారికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎన్నోసార్లు కొల్లగొట్టబడ్డా తరగని సంపదను, వేద విజ్ఞానాన్ని ఎక్కడినుంచీ పొందారు? ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం భగవంతుణ్ణి పూజించడం వల్ల జ్ఞానం లభించిందా?
Promoted Content