
1. వాస్తు ప్రకారం – గృహాలంకరణ
ఇంటిని అలంకరించుకోవడానికి వాస్తు శాస్త్రం కొన్ని మార్గదర్శకాలను అందిస్తుంది. ఇంటిని అలంకరించడానికి ఇంట్లో వివిధ ప్రదేశాలను అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యం.
ఇవి రెండు రకాలైనవి.
- అనుకూల ప్రదేశాలు
- ప్రతికూల ప్రదేశాలు.
ప్రతికూల ప్రదేశాలతో పోలిస్తే సానుకూల ప్రదేశాలను తేలికగా ఉంచాలని వాస్తు స్పష్టం చేస్తోంది. భారీ ఫర్నిచర్, ఇతర వస్తువులు ప్రతికూల ప్రదేశాల్లో అమర్చాలి. తేలికైన ఫర్నిచర్ ను సానుకూలమైన ప్రదేశాల్లో అమర్చాలి. ఉత్తరం, తూర్పు, ఈశాన్యం సానుకూల ప్రదేశాలు లేదా తేలికైన దిక్కులు కాగా, మిగితావి ప్రతికూల ప్రదేశాలు.
Promoted Content