
బట్ట తల సమస్య కు పరిష్కారం | Home Remedies for Hair Growth in Telugu
బట్టతల కు అసలయిన కారణం అతి గా షాంపూలు తల కు వాడడం
మార్గాలు 1 రోజు రాత్రి బట్టతల పైన ముల్లంగి రసాన్ని నిదానం గా, మెల్లగా లోపలకి ఇంకేటట్లు గా అయిదు నుండి పది నిమిషాలు పాటు మర్దన చేయి తల మీద మంట గా అనిపిస్తే 2,3 రోజులు ముల్లంగి రసాన్ని రాయడం ఆపి కొబ్బరి నూనె రాసుకోవాలి
2ప్రతి రోజు ఉదయం కుంకుడు పొడి, శీకాయ పొడి, ఉసిరిక పొడి, మారేడు పండ్ల గుజ్జు పొడి ఈ నాలుగింటిని కలిపిన మిశ్రమం చూర్ణం రెండు చెంచాల మోతాదుగా మూడు చెంచాల నిమ్మరసం తో కలిపి తల కు రుద్ది ఒక గంట తరువాత తలస్నానం చేయాలి
3 ప్రశస్తమైన పలుచని వేప నూనె తెచ్చుకొని రెండు పుటల ముక్క రంధ్రలో రెండు చుక్కలు వేయాలి
4 కలబంద లోని తెల్లని గుజ్జును తీసి, కొబ్బరి నూనె లో మరిగించి, ఆ తైలాన్ని రోజు రాసిమర్దన చేస్తుంటే జుట్టు రాలదు
5 సుగంధ తైలం తయారీ విధానం:
ముల్లంగి రసం – 100 గ్రాములు
గుంటగలగర ఆకు రసం – 100 గ్రాములు
ఉల్లి రసం – 100 గ్రాములు
నువ్వుల నూనె – 500 గ్రాములు
పైన తెలిపిన అన్నిటినీ కలిపి, సన్నటి మంటపై నూనె మాత్రమే మిగిలే వరకు వేడిచేయాలి.
దీన్ని చల్లార్చి నిల్వచేసుకోవాలి.
రోజూ రాత్రి ఈ నూనెను గోరువెచ్చగా చేసి, తలకు మర్ధనా చేసుకున్నట్లయితే, జుట్టు రాలటం తగ్గి, బట్ట తల సమస్య చాలా వరకు తగ్గుతుంది.
ఇలా ప్రయత్నిస్తుంటే క్రమంగా బట్టతల సమస్య తీరుతుంది