మేషం

అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు కృత్తిక 1వ పాదం

మేష రాశి వార ఫలాలు (14 నవంబర్ నుండి 20 నవంబర్ వరకు)

మేష రాశి వారి జూలై 2021 మాస ఫలాలు

Plava Nama Samvatsara Mesha Rasi Phalalu in Telugu

ఈ రాశి వారికి గురుడు ది. 20-11-2021 వరకు తామమూర్తిగా పదవ యింట సంచారం చేస్తారు తదుపరి రజతమూర్తిగా పదకొండవ యింట సంచారం చేస్తారు. శని ఈ సంవత్సరము అంతా పదవ యింట రజతమూర్తిగా సంచారం చేస్తారు. రాహు-కేతువులు సంవత్సరం మొత్తం 2-8వ యింట లోహమూర్తులుగా సంచారం చేయనున్నారు.

ఈ సంవత్సరం దీర్ఘ సంచార గ్రహములలో రాహు, గురుల అనుకూలత ఈ రాశి వారికి ఉంటుంది. శనీశ్వరుడు పదవ స్థానములో మిశ్రమ ఫలితాలను ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం గురుని అతిచారము వలన 6-4-2021 తదుపరి కుంభమందు మేషరాశి వారికి అనుకూల ఫలితం ఇవ్వనున్నారు.

ది. 6-4-2021 వరకు గురుని పదవస్థాన సంచారము వలన అలాగే గురు, శనుల యుతి కారణం చేత “ధ్యాననాశోధనచ్ఛేదం వృధా సంచరణం భయం” అను శాస్త్ర వచనం ప్రకారం ఉద్యోగ పూర్వక ఇబ్బందులకు అవకాశమున్నది. స్థానచలనములు, ఉద్యోగమున ఊహించని మార్పు ఉద్యోగము నందు ధననష్టము కలుగును. నిరుద్యోగులు

మోసగింపబడతారు. ప్రమోషను ఆలస్యమగును. పని భారము పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత లోపిస్తుంది. అనవసరపు ప్రయాణములు అధికమగును. ఖర్చు ఎక్కువ.

ది. 6-04-2021 తదుపరి గురుని లాభస్థాన సంచారం 16-09-2021 వరకు అనుకూలమున ఫలితాలు ఈ రాశి వారికి ఉంటాయి. “యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయస్సుఖం” అను శాస్త్ర వచనం  ప్రకారం కీర్తి ప్రతిష్టలు పెరుగును. ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగమునందు ఉన్నత స్థితి వ్యాపారలాభము, సంతానము, శత్రు నాశనం కలుగును. వివాహాది శుభ కార్యక్రమములు, దేవాలయాల సందర్శనముతో ఆనందమును కాలమును ఈ రాశివారు గడుపుతారు.

శని, రాహు, కేతు, సంచారము వలన” సౌభాగ్య భాగ్యమారోగ్యం అర్థలాభం యశస్కరం” అను శాస్త్ర వచనం ప్రకారం శుభకార్యములు జరుగును. ఆరోగ్యం బాగుగా ఉంటుంది. ఆర్ధికంగా ఉన్నత స్థితి కలుగును. విందు, వినోదాలలో పాల్గొంటారు

కొండప్రాంత సంచారం చేస్తారు. “వ్యాకులం శోక సంతాపః పాపముద్యోగ విఘకమ్ అను శాస్త్ర వచనం ప్రకారం ఉద్యోగములో ఊహించని మార్పు,

శోకము, ఉద్యోగ భంగము పనుల యందు జాప్యము ఇవి కలుగును. –

మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏప్రిల్ నుండి సెప్టెంబరు మధ్య కాలము బాగుగా ఉన్నది. ఈ సమయమందే నూతన గృహ, వాహన సౌఖ్యము కలుగుతుంది. ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపారముల రీత్యా వచ్చే సమస్యలను, ఆరోగం ఆర్ధిక సమస్యలను అధిగమించుటకు “మన్యుసూక్త పారాయణ” లేదా “మన్యు పాశు పతము” చేయించుకొనుట ఉత్తమము, శనివారము ప్రదోష సమయంలో శివాలయమున నువ్వుల నూనెతో దీపారాధన మంచిది. ప్రతి నిత్యం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయుట ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.