కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి 1,2,3,4 పాదాలు, ఆశ్లేష 1,2,3,4 పాదాలు

కర్కాటక రాశి వార ఫలాలు (14 నవంబర్ నుండి 20 నవంబర్ వరకు)

కర్కాటకం రాశి వారి జూలై 2021 మాస ఫలాలు

Plava Nama Samvatsara Karkataka Rasi Phalalu

ఈ రాశివారికి ది. 20-11-2021 వరకు గురుడు ఏడవ యింట లోహమూర్తి, తదుపరి ఎనిమిదవ యింట సువర్ణమూర్తిగా సంచారం చేయనున్నారు. శని సంవత్సరాంతం వరకు ఏడవ యింట సువర్ణ మూర్తిగా సంచారం చేస్తారు. రాహు, కేతువులు. సంవత్సరమంతా 11-5 స్థానాలలో లోహమూర్తులుగా సంచారం చేయనున్నారు.

ఈ రాశి వారికి ది. 6-4-2021 వరకు దీర్ఘ సంచార గ్రహములు అయిన గురు, రాహువులు పూర్తిగా యోగించనున్నారు. శనైశ్చరుడు సప్తమ స్థానమందు మిశ్రమ ఫలితాలను ఇవ్వనున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తరువాత రాహువు పీడ ఈ రాశి వారికి పోయినది. గత సంవత్సరముతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ రాశివారు మెరుగయిన ఫలితాలను పొందబోతున్నారు.

సప్తమ గురు, లాభ రాహు అనుకూలత వలన ఆర్ధిక ప్రగతి వుంటుంది. శుభ కార్యక్రమములు చేస్తారు. ఉద్యోగములో పదోన్నతి కలుగును. కావలసిన ప్రదేశమునకు బదిలీలు జరుగును. మిత్రుల వలన శుభవర్తమానము “రాజదర్శనమారోగ్యం, గాంభీర్యం గాత్రపోషణం” అను శాస్త్ర వచనం ప్రకారం ప్రభుత్వ పరంగా గత కొంతకాలంగా పడుతున్న : ఇబ్బంది నుండి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగుగా వుంటుంది. “గోవాజి గజాసంఘానాం క్షీరాన్నాది సుభోజనమ్” అను శాస్త్ర వచనం ప్రకారం సమాజంలో  గౌరవ మర్యాదలు పెరుగును. నూతన పదవులు అధిరోహిస్తారు. భోజన సౌఖ్యం ఉండును.

సప్తమ శని సంచార రీత్యా దూర ప్రాంత సంచారమునకు అవకాశము ఉన్నది. విదేశీయానము, నౌకాయానము చేస్తారు. వ్యాపారములో కీలక మార్పులు చేసారు ఉన్నత ఉద్యోగాలు లభించగలవు. బదిలీ మీద అధికారము లభించగలదు. వివాహాది శుభకార్యములు చేస్తారు. సంతానము కలుగును. ది. 6-4-2021 తదుపరి ‘అష్టమ గురు’ దోషము వస్తున్నది. కావున భూ-క్రయవిక్రయములు, ఉద్యోగ మార్పు తదితర విషయములు ఏప్రిల్ లోపు మాత్రమే లాభిస్తాయి.

ఏప్రిల్ 6 దాటిన పిదప “చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం” అను శాస్త్ర వచనం ప్రకారం ప్రభుత్వాధికారుల వలన ఇబ్బంది కలుగును. చోర భయము, అగ్ని భయము ఉండును. ముఖ్యమయినటువంటి వస్తువులు పోగొట్టుకుంటారు. క్రోధము అధికమగును. భయము పెరుగును.

మొత్తం మీద ఈ రాశి వారికి ఏప్రిల్ ముందు కాలము చాలా బాగున్నది. కావున ముఖ్యమయిన పనులన్నీ ఏప్రిల్ లోపు ముగించుట మంచి ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ తరువాత ఈ క్రింది సంకల్పంతో ప్రతి గురువారం శనగలు దానము చేసినచో వ్యతిరేక ఫలితలము తగ్గును ‘గురు చరిత్ర” పారాయణ శుభాలను ఇస్తుంది.

సంకల్పం: మమ చన్హ లగ్న వశాత్ “అష్టమ గురు” దోష పరిహారార్ధం.