మిధునం

మృగశిర 3,4 పాదాలు, ఆర్ధ్ర 1,2,3,4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు

మిధున రాశి వార ఫలాలు(14 నవంబర్ నుండి 20 నవంబర్ వరకు)

మిధున రాశి వారి జూలై 2021 మాస ఫలాలు

Plava Nama Samvatsara Mithuna Rasi Phalalu

ఈ రాశి వారికి ది. 20-11-2021 వరకు గురుడు ఎనిమిదవ యింట తామ్రమూర్తి, తదుపరి ఎనిమిదవ యింట లోహమూర్తిగా సంచారం చేయనున్నారు. శని ఈ సంవత్సరం వరకు ఎనిమిదవ యింట లోహమూర్తిగా సంచరిస్తారు. రాహు – కేతువులు సంవత్సరం మొత్తం 12-6 వ యింట రజత మూర్తులుగా సంచారం చేయనున్నారు.

ఈ రాశి వారికి ది. 6-4-2021 వరకు దీర్ఘ సంచార గ్రహములు అయిన గురు, రాహు, శనులు పూర్తి వ్యతిరేకమున ఫలితాలను ఇవ్వనున్నారు. అష్టమ శని, అష్టమ గురు మరియు వ్యయ రాహు దోషములు కొంతవరకు ఇబ్బంది కలిగించు అవకాశములున్నవి. జాతకమందు మంచి దశలు నడుస్తున్నచో ఈ గ్రహస్థితి ఇబ్బంది పెట్టదు. జాతకమున మంచి దశలు నడవనిచో, ఈ రాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా ఏప్రిల్ వరకు చాలా జాగ్రత్తగా ఉండవలెను.

అష్టమ గురు, శనుల వలన ఆకస్మిక ఆర్ధిక ఇబ్బందులు అనుకోని ప్రమాదములకు అవకాశం ఉండును. “చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం” అను శాస్త్ర వచనం ప్రకారం ఉన్నతాధికారుల వలన ఇబ్బందులు, ప్రభుత్వమునకు సంబంధించిన పనులలో జాప్యము. చోర, అగ్ని, భయము, ముఖ్యమయిన వస్తువులను జారవిడుచుట జరుగును ముఖ్యంగా మానసికముగా భయము అధికమగును. క్రోధము అధికమగును.

“నానాకార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం” అను శాస్త్రము ప్రకారం పనులలో  జాప్యము – అకారణంగా గొడవలు కంటికి సంబంధించిన ఇబ్బందులు కలుగును

ముఖ్యంగా ‘వ్యయ రాహు’ దోషము వలన మోసపోవడము, ధనము చేతి యందు నిల్వ ఉండుట కష్టము శతృభయము కలుగును. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగును  వ్యాపారస్తులకు మిశ్రమ సమయము అయితే భగవంతుని కృప వలన ఏప్రిల్ నెలలో గురు సంచారము కుంభరాశిలో ఉండుటచే (అతిచారము వలన) ది. 6-4-209, లగాయితు 16-09-2021 వరకు గురు బలము వస్తున్నది. కావున ఏప్రిల్ నుంచి మంచి రోజులు వస్తాయి.

“అర్ధంచ స్వకులాచారః గృహేనిత్యోత్సవ శుభమ్” అను శాస్త్ర వచనం ప్రకారం గురుబలము వచ్చిన పిదప ఆర్ధిక ప్రగతి కనబడుతున్నది. శుభ కార్యక్రమములు ఆనందమయిన వాతావరణం, దూరప్రాంత సంచారము, ఉద్యోగములో పదోన్నతి సంతానము, వివాహాది శుభకార్యక్రమము ఇవి కలుగును. నూతన గృహ వాహన సౌఖ్యము కలుగును.

మొత్తం మీద మిధునరాశి వారికి ఏప్రిల్ వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలము. ఆ తదుపరి గురుబలము చేత మంచి రోజులు వచ్చును. ఈ రాశివారు మంచి ఫలితాలు కలగాలి అంటే 

సంకల్పం 1 : మమ చక్ర లగ్న వశాత్ “అష్టమ శని” దోష పరిహారార్ధం. అను సంక్పంతో శనిజపము జరిపి దానమీయుట, ప్రతి శనివారం ప్రదోష సమయంలో శివాలయములో దీపారాధన చేయుట ఉత్తమము. 

సంకల్పం 2 : మమ చన్హ లగ్న వశాత్ “అష్టమ గురు” దోష పరిహారార్ధం అను సంకల్పంతో “గురు చరిత్ర” పారాయణ చేసి గురువారం శనగలు దానమీయుట మంచిది.