సింహం

మఖ 1,2,3,4 పాదాలు పుబ్బ 2,3,4 పాదాలు, ఉత్తర 1వ పాదం

సింహ రాశి వార ఫలాలు (14 నవంబర్ నుండి 20 నవంబర్ వరకు)

సింహ వృషభ రాశి వారి జూలై 2021 మాస ఫలాలు

Plava Nama Samvatsara Simha Rasi Phalalu

ఈ రాశివారికి గురుడు ది. 20-11-2021 వరకు ఆరవ ఐదవ యింట సువర్ణమూర్తి, తదుపరి ఏడవ యింట తామ్రమూర్తిగా సంచారం చేయనున్నారు. శని సంవత్సరాంతం వరకు ఆరవ యింట రజత మూర్తిగా సంచరిస్తారు.

రాహు-కేతువులు సంవత్సరాంతం వరకు 10-4 యింట తామ్రమూర్తులుగా సంచరిస్తారు.

దీర్ఘ సంచార గ్రహములయిన శని, రాహువులు అనుకూలిస్తుండగా ఏప్రిల్ నుండి గురుబలము ఈ రాశివారికి వస్తున్నది. ఈ రాశి వారికి ముఖ్యంగా ది. 21-9-2020 లగాయితు రాహువు దశమ స్థానములో సంచరిస్తున్నారు. ఈ రాహు సంచారము వలన వృత్తిలో కొన్ని క్రియాశీలకమయిన మార్పులు వచ్చును. వృత్తి – ఉద్యోగాలలో మార్పు, స్థానచలనము, పనిచేసే రంగంలో మార్పులు రాహు సంచారము వలన ఏర్పడతాయి.

ఆరవ స్థానంలో శని, దశమ రాహు సంచారము వలన, “ధనధాన్యాది వృద్ధించ స్త్రీ పుత్ర సుఖవర్ధనమ్” అను శాస్త్ర వచనం ప్రకారం ఆర్ధిక పురోగతి బాగుగా ఉంటుంది. వివాహాది శుభకార్యములు జరుగుతాయి. సంతానము కలుగును. సంతాన పురోగతి బాగుగా వుంటుంది. గృహ నిర్మాణము, భూ క్రయ విక్రయాది విషయాలు బాగుగా ఉంటాయి. “మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనమ్” అను శాస్త్ర వచనం ప్రకారం మానసిక ప్రశాంతత ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ది. 6-4-2021 వరకు ‘షష్ఠ గురు’ సంచారము వలన “ధారాపుత్ర విరోధస్య స్వజనేకలహస్థధా” అను శాస్త్ర వచనం ప్రకారం కుటుంబానికి దూరంగా కాలాని గడుపుతారు. దూరప్రాంత సంచారము, కుటుంబ కలహములు కలుగును. ముఖ్యమయిన వస్తువులు దొంగల పాలగుట, అగ్ని భయము కలుగును. శతృవులు పెరుగును. ప్రభుత్వముకు సంబంధించిన పనులు జాప్యముతో ముందుకు వెళతాయి.

ఏప్రిల్ తదుపరి గురుబలము వస్తున్నది. “రాజదర్శనమారోగ్యం గాంభీర్యం గ్మాత పోషణం” అను శాస్త్రవచనం ప్రకారము ఆర్ధికాభివృద్ధి, శుభకార్యములు జరుగుట, నూతన వస్తు-వస్త్ర లాభము సమాజంలో ఉన్నత వర్గం వారితో పరిచయములు. ఉద్యోగములో ప్రమోషన్లు, వ్యాపారాభివృద్ధి కలుగును. ఈ గురుబలము వలన విశేషమయిన ఆనందము, ఆర్ధికాభివృద్ధి కలిగి బంధువులతో సుఖంగా ఉందురు.

మొత్తం మీద 6-4-2021 వరకు కొంత వ్యతిరేకముగా గ్రహస్థితి ఉన్నప్పటికీ ఆ తదుపరి గురుబలము ప్రభావముచే అన్ని విధములుగా ఈ రాశివారికి బాగుగా వున్నది. కావున ఏప్రిల్ వరకు ఈ క్రింది సంకల్పముతో ప్రతి గురువారము శనగలు దానమీయుట ప్రతీరోజూ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చెయ్యుట వలన మంచి ఫలితాలను పొంద గలుగుతారు. 

సంకల్పము : మమ చక్ర లగ్న వశాత్ “షష్ఠ గురు” దోష పరిహారార్ధం.