ధనస్సు

మూల1,2,3,4 , పాదాలు, పూర్వాషాఢ1,2,3,4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం

ధనుస్సు రాశి వార ఫలాలు (14 నవంబర్ నుండి 20 నవంబర్ వరకు)

ధనుస్సు రాశి వారి జూలై 2021 మాస ఫలాలు

Plava Nama Samvatsara Dhanu Rasi Phalalu

ఈ రాశివారికి ది. 20-11-2021 వరకు గురుడు రెండవ స్థానమందు రజత మూర్తిగా సంచరిస్తారు. తదుపరి మూడవ యింట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. శనీశ్వరుడు సంవత్సరం మొత్తం రెండవ యింట సువర్ణమూర్తిగా సంచరిస్తారు. రాహు-కేతువులు సంవత్సరాంతం వరకు 6-12వ యింట సువర్ణమూర్తిగా సంచారం చేయనున్నారు.

ఈ రాశి వారికి శనైశ్చరుడు మినహా మిగిలిన రెండు దీర్ఘ సంచార గ్రహములు అయిన రాహు, గురులు యోగిస్తున్నారు.

చాలాకాలం తరువాత గురు-రాహువుల బలం రావడంతో ఈ రాశికి చాలా అనుకూలమయిన గ్రహస్థితి ఈ సంవత్సరం ఉన్నది ‘ఏలినాటి శని’ దోషము చివరలో ఉన్న కారణం చేత గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగయిన శుభ ఫలితాలు వస్తాయి.

“ధైర్య బుద్ధిర్వీర్య బుద్ధి రిపునాశం సదా శుభం” అను శాస్త్ర వచనం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఏది మిమ్మల్ని భయపెడుతున్నదో ఆ భయాన్ని ఛేదించగలుగుతారు. ధైర్య సాహసములు ప్రదర్శిస్తారు. శతృవులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించగలుగుతారు. ఋణాల బాధ తగ్గుముఖం పడుతుంది. శుభకార్యక్రమములు చేస్తారు. రోగ బాధ నుండి విముక్తి కలుగుతుంది. ప్రభుత్వము నుండి ఋణములు సకాలంలో అందుతాయి. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం పెరుగుతుంది.

“మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమః” అను శాస్త్ర వచనం ప్రకారం  వివాహాది శుభకార్యక్రమములు చేస్తారు. ఆర్ధిక ఉన్నతి కలిగి గతంలో కష్టపడి పనిచేసిన పనులకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగములో పదోన్నతి, నూతన వాహన గృహ యోగము. విద్యార్ధులకు, ఉద్యోగార్థులకు మంచి సమయము. శుభకార్యక్రమములకు, ధర్మ కార్యములకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును.

సదాకేశం వృధావైరం సతతం కార్యనాశనం” అను శాస్త్ర వచనం ప్రకారం ఏలిన నాటి శని దోషము వలన ఎల్లప్పుడూ గొడవలు, అనవసరపు ప్రయాణములు పనులు సకాలంలో పూర్తకవపోవుట, మాట వలన ఇబ్బందులు, సొంత మనుషులు తిరస్కరణ, ప్రేమలో విఫలమవుట, నిద్రపట్టకపోవుట, బద్దకము అధికమవుట ఉండును.

ఏప్రిల్ దాటిన పిదప కొంతకాలం గురుబలము తగ్గుట వలన ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మార్పులకు ఏప్రిల్ లోపే మంచి సమయము వ్యాపారస్తులకు ఈ కాలం కలసి వస్తుంది. విద్యార్ధులకు మిశ్రమ సమయము సంతాన సమస్యల నుండి విముకి లభిస్తుంది. భూ లావాదేవీలలో జాప్యము కొనసాగుతుంది.

గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ రాశివారికి మెరుగయిన ఫలితాలు రానున్నాయి. అయితే మరిన్ని అనుకూల ఫలితాల కోసం సంకల్ప విధానంతో దానము ఇచ్చుట మంచిది.

సంకల్పము: మమ చన్హ లగ్న వశాత్ “ద్వితీయ శని” పరిహారార్ధం అను సంకల్పంతో నువ్వులు దానమీయుట, “మన్యుపాశుపత” హోమము, మాస శివరాత్రి అభిషేకము మంచి ఫలితాలను ఇస్తాయి.