వృశ్చికం

విశాఖ 4వ పాదం, అనూరాధ, 1,2,3,4 పాదాలు, జ్యేష్ట 1,2,3,4 పాదాలు

వృశ్చిక రాశి వార ఫలాలు (14 నవంబర్ నుండి 20 నవంబర్ వరకు)

వృశ్చిక రాశి వారి జూలై 2021 మాస ఫలాలు

Plava Nama Samvatsara Vrischika Rasi Phalalu

ఈ రాశివారికి ది. 20-11-2021 వరకు గురుడు మూడవ యింట తామ్రమూర్తి, తదుపరి నాల్గవ యింట లోహమూర్తిగా సంచారం చేయనున్నారు. శనీశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం మూడవ యింట రజత మూర్తిగా సంచారం చేయనున్నారు. రాహు-కేతువులు సంవత్సర మొత్తం 7-1 స్థానాలలో లోహమూర్తులుగా సంచరిస్తారు.

ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహములలో శనైశ్చరుని యొక్క అనుకూలత వున్నది. గురువు వ్యతిరేకమయిన ఫలితాలు ఇస్తుండగా రాహువు సప్తమ స్థానమున వ్యతిరేక ఫలితాలను ప్రసాదిస్తున్నారు. ఈ గ్రహస్థితిని అనుసరించి జ్యోతిష శాస్త్రమందు చెప్పబడిన విషయం ఏమనగా గోచారము రీత్యా శని, గురులలో శని అనుకూలించిన యెడల గురువు ఇచ్చే వ్యతిరేక ఫలము తగ్గును. ఆ విధంగా చూసినచో ఈ రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమముగా నడుచును.

“అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనమ్” అను శాస్త్ర వచనం ప్రకారం మానసిక అశాంతి ఉండును. బంధు విరోధములు, ధనవ్యయము అధికము, ఉద్యోగమున మార్పులు ముఖ్యంగా బదిలీలకు అవకాశము అధికము పని ఒత్తిడి అధికముగా ఉండును.

పై అధికారులతో మాట పట్టింపులకు అవకాశము ఉన్నది. “కరపదంగులై కుష్ఠయీ జమిత్రే  ఫణి సంసితే” అను శాస్త్ర వచనం ప్రకారం విదేశీ ప్రయాణములు అనుకూలిస్తాయి చర్మ  సంబంధిత వ్యాధులకు అవకాశమున్నది. కుటుంబమునకు దూరంగా వెళ్ళుటకు  అవకాశమున్నది. భార్యా భర్తలకు మనస్పర్థలు వచ్చుటకు అవకాశమున్నది.

ఏప్రిల్ 6 తదుపరి “అర్ధాష్టమ గురు” సంచారము నందు ప్రయాణములు అధికము బద్దకము పెరుగుతుంది. కావాలని కొంతమంది మీ మీద చెడు ప్రచారము చేసారు బుద్ధి చాంచల్యము అధికము. ఉద్యోగ మార్పుకు అవకాశమున్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం గురుబలము తక్కువగా ఉన్నది. కావున గురువారము శనగలు దానమీయుట, ప్రతీ రోజూ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ లేదా “గురు చరిత్ర” పారాయణ ఉత్తమ ఫలితాలు ఇచ్చును.