వృషభం

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1,2,3,4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు

వృషభ రాశి వార ఫలాలు (14 నవంబర్ నుండి 20 నవంబర్ వరకు)

వృషభ రాశి వారి జూలై 2021 మాస ఫలాలు

Plava Nama Samvatsara Vrishabha Rasi Phalalu

ఈ రాశి వారికి ది. 20-11-2021 వరకు గురుడు తొమ్మిదవ యింట రజతమూర్తి తదుపరి పదవ యింట సువర్ణ మూర్తిగా సంచారం చేయనున్నారు. శని ఈ సంవత్సరమంతా తొమ్మిదవ యింట తామ్రమూర్తిగా సంచరిస్తారు. రాహు-కేతువులు ఈ సంవత్సరం మొత్తం 1-7వ యింట సువర్ణమూర్తులుగా సంచారం చేయనున్నారు.

దీర్ఘ సంచార గ్రహములలో గురుని యొక్క అనుకూలత ఈ రాశివారికి వున్నది. 6-4-2021 వరకు తదుపరి ది. 16-09-2021 దాటిన పిదప ఈ రాశివారికి గురు బలము ఉన్నది. శని, రాహు, కేతువులు మిశ్రమ ఫలితాలను ఇవ్వనున్నారు. జన్మరాహువు భాగ్య శని, రాజ్య గురువు ఉన్న సమయము అనగా ఏప్రిల్ నుండి సెప్టెంబరు మధ్యకాలము ఈ రాశివారికి ప్రతికూల ఫలితములను ఇస్తుంది.

ది. 6-4-2021 వరకు గురుడు తొమ్మిదవ ఇంట సంచారము “అర్ధంచ స్వకులాచారః” గృహే నిత్యోత్సవ శుభమ్” అనుశాస్త్ర వచనం ప్రకారం శుభకార్యములు చేస్తారు. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. సంతానము కలుగును. ఉద్యోగమున ఉన్నత స్థానము, వ్యాపార పరంగా అనుకూల స్థితి, బంధుమిత్రుల కలయిక, భోజన సౌఖ్యము కలుగును.

ఏప్రిల్ నుండి సెప్టెంబరు వరకు జన్మరాహు, భాగ్యశని,రాజ్య గురుని వ్యతిరేక ఫలితములు వచ్చును  “శోకం రోగం మహాదుఃఖం క్వచిద్రవ్యం క్వచిత్సుఖమ్” అను శాస్త్ర వచనం ప్రకారం 

ఆరిక భారము పెరుగును. దుఃఖము, వ్యాధి, ఒకానొకపుడు దన లాభము, ఒకానొకప్పుడు సుఖము , పెండ్లాము, సంతానము  గురించి కష్టపడవల్సిన పరిస్థితి వచ్చును. “ధ్యాననాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయమ్” అను శాస్త్ర వచనం  ప్రకారం ఖర్చు అధికమగును. వృధా ప్రయాణములు చేస్తారు. మనోధైర్యం తగ్గుతుంది. 

జన్న రాహు సంచారం రీత్యా “ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అను శాసవచనం ప్రకారం, కుటుంబానికి దూరంగా కాలాన్ని గడుపుతారు. ఎవరో ఒకరు, కావాలని మనమీద చెడు ప్రచారం చేస్తారు. కుటుంబంలో శుభకార్యక్రమములు వల్ల ఆర్థికభారం పడుతుంది. మన స్థాయిని మించి ఎదుటివారి మెప్పు కొరకు లగ్జరీకు ధనాని ఖర్చు పెడతారు. జూదము, స్టాకు మార్కెట్లలో ధనాన్ని కోల్పోయే ప్రమాదము ఉన్నది.

వృషభరాశి వారికి ఈ సంవత్సరమంతా చూసినపుడు ఏప్రిల్ నుండి సెప్టెంబరు కాలము మినహా మిగిలిన సమయము అంతా బాగుగా వున్నది. వీరు మరిన్ని ఉన్నతమయిన ఫలితాలు సాధించాలి అంటే “మమ చన్ద లగ్న వశాత్ జన్మరాహు దోష పరిహారార్ధం” అనే సంకల్పంతో సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం మంచిది. గురువు యొక్క అనుగ్రహము కొరకు గురుచరిత్ర పారాయణము లేదా ప్రతిరోజూ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.