కన్య

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1,2,3,4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు

కన్య రాశి వార ఫలాలు (14 నవంబర్ నుండి 20 నవంబర్ వరకు)

Plava Nama Samvatsara Kanya Rasi Phalalu

ఈ రాశివారికి ది. 20-11-2021 వరకు, గురుడు ఐదవ యింట రజతమూర్తి. తదుపరి ఆరవ యింట రజత మూర్తిగా సంచారం చెయ్యనున్నారు. శని ఈ సంవత్సరం వరకు ఐదవ యింట లోహమూర్తిగా సంచారం చేస్తారు.

రాహు-కేతువులు సంవత్సరాంతం వరకు 9-3 స్థానాలలో రజత మూర్తులుగా సంచరించనున్నారు.

ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహములయిన శని, రాహువులు వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉండగా, గురుడు పంచమ స్థానమందు ది. 6-4-2021 వరకు శుభ ఫలితాలను ఇవ్వనున్నారు. చన్హ లగ్నాన్ని అనుసరించి శని, రాహు, గురువులు కోణ స్థానాలలో ఉండడం, గురుడు మరో కోణమయిన చన్ద లగ్నమును చూడడం మూడు కోణాలకి సంబంధం ఉండుట ఈ సంవత్సరం ఈ రాశి వారి జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేయబోతున్నది.

దాదాపు రెండున్నర సంవత్సరముల అర్ధాష్టమ శని తరువాత మొదటిసారి గురు బలము వచ్చిన కారణం చేత ది. 6-4-2021 వరకు చాలా యోగ్యమయిన కాలము. “అర్ధలాభం తథైశ్వర్యం స్వకర్మ రతి హర్షితం” అను శాస్త్ర వచనం ప్రకారం ఆర్ధిక పురోగతి వుంటుంది. నూతన వస్తు – వస్త్ర లాభము, శుభకార్యక్రమములు చేస్తారు. మరియు పాల్గొంటారు. సంతానము కలుగును. సంతాన పురోగతి బాగుగా ఉండును మిత్రులు. సన్నిహితులతో ఉల్లాసముగా విహార యాత్రలు చేస్తారు.

పంచమ శని, భాగ్య రాహు సంచారము వలన ఖర్చులు అధికమగును. “కార్య హానిర్మనస్థాపః జ్ఞాతి వ్యాజ్య కలాపహమ్” అను శాస్త్రవచనం ప్రకారం ముఖ్యమయిన పనులు వాయిదా పడతాయి. అవమానము, అన్నదమ్ములతో ఆస్థి తగాదాలు, కోర్టు కేసులు వంటివి ఉండును. స్త్రీ మూలక ధనక్షయము కలుగుతుంది. ముఖ్యంగా ధనాన్ని ఎవరిచేతి లోను వుంచరాదు. మోసపోయే అవకాశము అధికము ఉద్యోగములు ఇప్పిస్తాము అని చెప్పి డబ్బులు తీసుకునేవారి దగ్గర మోసపోతారు. లగ్జరీ వస్తువులకు బ్రాండెడ్ దుస్తులకు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు.

ది. 6-4-2021 తదుపరి గురుబలము తగ్గుతున్నది. కావున ఏప్రిల్ తదుపరి మరింత జాగ్రత్తగా ఉండవలెను. శతృవుల ప్రభావం అధికంగా ఉండును. ఉద్యోగములో ఒత్తిడి పెరుగును. బదిలీలు జరుగుటకు అవకాశమున్నది. కుటుంబమునకు దూరంగా జీవించుట జరుగుతుంది. ప్రభుత్వ పరంగా రావలసిన డబ్బు (ఋణములు) చేతికి అందును అప్పులు చేస్తారు.

మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మెరుగయిన గ్రహస్థితి ఉన్నది. ఏప్రిల్ లోపు ముఖ్యమయిన పనులు ముగించుకొనుట మంచిది. ప్రతిరోజూ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయుట మంచిది. ముఖ్యంగా సర్పసూక్తముతో సుబ్రహ్మణ్యేశ్వరునకు అభిషేకము లేదా మన్యు పాశుపత హోమము ద్వారా ప్రశాంతతను పొందగలుగుతారు.