రాశులు అనారోగ్యాలు – జాగ్రత్తలు

0
82179

Horoscopes Illnesses & Precautions (According to Each Zodiac Sign)

సాధరణంగా అనారోగ్యాలు పన్నెండు రాశుల వారికి వేరు వేరు విధంగా వుంటాయి. అవి రాకముందే కొన్ని రకాలైన జాగ్రత్తలు పాటించి ప్రయోజనం పొంవచ్చు. అసలు ఏయే రాశుల వారికి ఎలాంటి అనారోగ్యాలు సూచింపబడుతున్నాయి. జోతిష్యశాస్త్ర రీత్యా! అలాగే వారు ఎలాంటి ఆహరం తీసుకొని, ఎలాంటి మందులు వాడి చక్కని ఫలితాలు పొందవచ్చు అన్నది వివరంగా అందిస్తున్నాం.

సూచన:

ప్రతి వ్యక్తి వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం అత్యవసరం. తనకు గల లోపాలను తన రాశి బట్టీ,  జన్మ కుండలిని బట్టి, గ్రహస్థితిని బట్టీ గోచార ఫలితాలను బట్టీ… లగ్న షష్టి, అష్టమ భావాలను బట్టీ సంపూర్ణంగా గ్రహించి వాటిని పరిష్కరించుకునే అవకాశాలు అధికం చేసుకోవాలి. అలా రాబోయే లోపాలను, సమస్యలను, ఇబ్బందులను… ఆయా సమయాలను గుర్తించి చెప్పెది జోతిశ్యాస్త్రం. చక్కని ఉపాయాలను, పరిష్కారాలను, పరిహాలను, జాగ్రత్తలను మంచి జ్యోతిష్కుని ద్వారా తెలుసుకొని అవి ఆచరించి సత్పలితాలను సాధించడం శ్రేయస్కరం ఆనందవరం.

మేషాది మీన రాశులతో జన్మించిన వారికి ఈ రకమైన అనారోగ్యాలు వచ్చే అవకాశంవుంది అనీ చెప్పటం జరిగింది కానీ అన్నిరకాలు అందరికీ వస్తాయి అనీ, వచ్చి తీరుతాయి అనీ చెప్పటం లేదని సూచన. చాలా మంది ఇది చదివి అమ్మో. మేం ఫలానా రాశి… అంటే మాకు ఈ అనారోగ్యాలు కచ్చితంగా వస్తాయి అని దయచేసి కంగారు పడి మాకు కాల్స్‌ చేయవద్దు. ఒక మంచి విద్యను అభ్యసించిన అందరూ ఒకే రకమైన ఉన్నత ఉద్యోగాలు చెయ్యనట్లే… ఒక రాశిలో పుట్టినంత మాత్రన అందరికీ ఈ ఇబ్బందులు రావు, రావాలని లేదు. కానీ అవకాశం వుంది, ఎప్పుడంటే జన్మకుండలిలో గ్రహస్థితి సరిగా లేనపుడు. అలాగే వ్యాధి నిరోధక శక్తిని అందరూ పెంచుకోవాలి.

హోమియో ద్వారా సూచించిన మందులు (మీమీ రాశులకి) కూడా వాడమని, వాడి తీరాలని కాదు అర్థం, అయా రాశుల వారి తత్వానికి ఆయా హోమియో మందులు సరిపోతాయని సూచన మాత్రమే. విజ్ఞులు అయిన పాఠకులు ఈ వ్యాసం లోని అంశాలను గ్రహించి వారికి తగిన జాగ్రత్తలు పాటించి అనారోగ్యాలను దూరం చేసుకునే విధంగా జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనాన్ని అర్థం చేసుకోగలరి మా భావన. ఇందులోని, అనారోగ్యాలు అన్నీ మాకే వస్తాయని ఖంగారు పడద్దు. కేవలం ఆయో రాశులవారి ) ‘ కే వచ్చే అవకాశం వుంది అన్నదే మా పరిశీలన.

ఒక్కో రాశి ప్రకారం

Back

1. మేషం:

సాధారణంగా ఈ శాశి వారికి తల, ఉదరం (కదుపు), పైత్యం, నత్తి మూత్రపిండాలు, అగ్ని ద్వారా ఇబ్బందులు, కురుపులు(వ్రణాలు), చర్మమునకు సంబంధించిన విచిత్రమైన అనారోగ్యాలు, జ్వరాలు కలిగే అవకాశాలు మెండు. అంతేకాక అందవ్యాధులు, ఉష్ణంతో కూడిన కఫము, రక్త సంబంధ వ్యాధులు హెచ్చు.

జాగ్రత్తలు:

  1. ధ్యానం చేస్తూ ఉండాలి
  2. చల్లని పువ్వుల వాడకం మంచిది (పూలసువాసన)
  3. పసుపు + తేనే పరిగడుపున తీసుకోవాలి
  4. ఆహరంలో కందిపప్పు ఎక్కువగా వుండాలి.
Promoted Content
Back