How and to Whom Should the Donation be Made? (In Telugu)
దానం అనే మాటకు త్యాగమనే అర్థాన్ని సామాన్యంగా చెప్పుకుంటారు. తనకున్న దానిలో ఆర్తులకు మనస్ఫూర్తిగా ఇది నాకు వద్దు, పరులకు ఉపాయనంగా ఇస్తున్నాను అనే మనస్తత్వంతో ఇవ్వడాన్నే సాధారణంగా దానం అని అంటారు.
ఇక్ష్వాకు వంశరాజు రఘుమహారాజు ఆ యుగంలో ప్రపంచాన్ని జయించినవాడు. విశ్వజిత్ అనే యాగం చేశాడు. తన సర్వస్వాన్నీ ఇతరులకు ఇచ్చేశాడు. మహా త్యాగి అయ్యాడు. హిమాలయాలకు తపస్సుకై వెళ్లాడు. బలి చక్రవర్తి వామనునకు భూదానం చేసి మహావిష్ణుని శక్తికిలోనై తాను పాతాళానికి వెళ్లాడు. శిబి చక్రవర్తి తన ప్రాణాన్నే అర్పించటానికి సిద్ధమై మహా దాతగా ప్రసిద్ధి వహించాడు. మహాభారత వీరుల్లో కర్ణుడు మహా దాత. తన ప్రాణాలకే ముప్పు కల్గుతుందని తెలిసీ సహజమైన తన కవచకుండలాలను బ్రాహ్మణరూపుడైన ఇంద్రునికి దానం చేశాడు.
Rules to be Followed While Harvesting Grain / Donation
అయితే ఈ విషయంలో మన పూర్వులు దానం చేసేటప్పుడు తాను చేసిన దానం సత్పాత్రదానమా? అపాత్ర దానమా? అని గుర్తించి చేయాల్సిందంటూ మార్గదర్శక సూత్రాలను నిర్దేశించి ఉన్నారు. అందుకే మానవునికి విద్య వినయాన్ని, వినయం వ్యక్తిత్వాన్ని, అందువల్ల సంపాదన, ఆ ధనంవల్ల దాన గుణం, దాని వల్ల ఐహిక ఆముష్మిక సుఖాలను మానవుడు పొందగలడని చెప్పారు. దీనిని గూర్చి మహాభారతంలో దానమును ఆచరించడం సర్వ జాతి సమాన్యమైన ఉత్తమధర్మమని వివరించి ఉన్నది.
Related Posts:
శ్లోకాలతో శనిదోష నివారణ చేసే ఉపాయం – Remedies for Shani Dosha