హనుమంతునికి ఆ పేరెలా వచ్చింది? | How Lord Hanuman Got His Name.

1
5570
hanuma
How Lord Hanuman Got His Name

How Lord Hanuman Got His Name

ఆంజనేయునికి సుందరుడనే పేరు ఉంది. ఆంజనేయునికి ప్రతీకగా రామాయణం లో సుందరకాండం ఉంటుంది. మరి సుందరుడు హనుమంతుడు ఎలా అయ్యాడు?

హనుమంతుడు అంటే విరిగిన దవడలు కలవాడన్న అర్థం వస్తుంది. ఆంజనేయునికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

చిన్న తనంలో ఆంజనేయుడు ఉదయిస్తున్న సూర్యుని చూసి ఫలమనుకుని నోట పెట్టుకున్నాడు. మొల్లోకాలూ గాఢాంధకారం లో మునిగిపోయాయి. పసిబాలుని శక్తికి ఇంద్రుడు కూడా ఉలిక్కిపడ్డాడు. బాలుని దుస్సాహసానికి కోపించి తన వజ్రాయుధం ఆంజనేయునిపైకి విసిరాడు. మహా శివుని అంశగా వాయుదేవుని వరంతో జన్మించిన ఆ మహాశక్తి సంపన్నుడైన ఆంజనేయుడు వజ్రాయుధం తగిలినా మరణించలేదు. ఆయుధం తగిలిన చోట దవడలు విరిగి మూర్చిల్లాడు. ఇంద్రుడు బాలునిపై చేసిన ఘాతుకానికి ఒక గుహలోనికి వెళ్ళి వాయుదేవుడు స్తంభించాడు.జీవులన్నీ ప్రాణవాయువు లేక మృతిచెందసాగాయి.  ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని వాయుదేవుని క్షమాపణ కోరాడు.

పరమ శివుడు హనుమంతుని చిరంజీవిగా దీవించి వాయుదేవుని సంతృప్తి పరచాడు. వాయుదేవుడు అప్పుడు గుహనుండి బయటకు వచ్చి సమస్త ప్రాణికోటినీ రక్షించాడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here