రోజూ నిద్రలేవగానే నీళ్ళు ఎన్నితాగాలి? ఎలాతాగాలి?

0
2436

వేదాలు, శృతులు, ఇతిహాసాలు మొదలైన భారతవాజ్మయంలో ప్రాచీన శాస్త్రవేత్తలైన మహర్పులు నిర్ధారించిచెప్పిన ప్రాత:కాల ఉదకపాన నియమనిబంధనలను వాటి లాభనష్టాలను సవివరంగా చెప్పుకుందాం.

ప్రియమైన ఆయుర్వేదమ్మ బిడ్డలారా! రాత్రి నిద్రించేముందు బంగారం, వెండి, రాగి, కంచు, అయస్కాంతం, మట్టి, గాజు, పింగాణి వీటిలో దేనితో చేయబడిన పాత్రలోనైనా మంచినీరు నింపి పడుకునే మంచం పక్కన చెక్కపీట పైన పెట్టుకోవాలి. పై లోహాలలో అన్నింటికన్నా మట్టిపాత్రగానీ, రాగిపాత్రగానీ మేలైనవని అధికశాతం మంది మహర్షులు నిర్ణయించారు కాబట్టి, ఆ పాత్రలు దొరకడం సులువు కాబట్టి వీరు మట్టి ముంతలోగానీ లేదా స్వచ్చమైన రాగిచెంబులోగానీ ఒక పెద్దగ్లాసెడు నీరుపోసి నిలువవుంచుకోండి. ఉదయం సూర్యోదయానికి ముందు అనగా రాత్రి చివరి ఝామున నిద్రలేచిన వెంటనే వేరే నీటితో నోరు – పుక్కిలించి వూసివేసి చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తడిచేతులతో కళ్ళుతుడుచుకొని మంచం పై కాళ్ళు పైకి పెట్టుకొని తూర్పుకు ఎదురుగా కూర్చొని చెంబు అందుకొని ఆనీటిని నిదానముగా కొద్ది కొద్దిగా సేవించాలి.