మన బ్రహ్మాండం వయస్సెంత? | How Old Is the Universe in Telugu

1
5138
The Helix Nebula is 700 light-years away from Earth, but screened before audience's eyes in reconstructed 3D in Hidden Universe, released in IMAX® theatres and giant-screen cinemas around the globe and produced by the Australian production company December Media in association with Film Victoria, Swinburne University of Technology, MacGillivray Freeman Films and ESO. The original image was taken by ESO's VISTA Telescope.
మన బ్రహ్మాండం వయస్సెంత? | How Old Is the Universe in Telugu

safe_image

Age Of Universe / మన బ్రహ్మాండం వయస్సెంత?

వేదాల ప్రకారం ఈ సృష్టికర్త విష్ణువు నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ. విష్ణుమూర్తి సనాతనుడు, నిత్యుడు. ఆయన నాభికమలం నుండి జన్మనొందిన బ్రహ్మ ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రహాలతో కూడిన ఈ విశ్వానికి ప్రతీక. మన వాంగ్మయంలో ఈ సృష్టి శబ్దం నుండి పుట్టిందని చెప్పబడి వుంది. దీనినే నేటి శాస్త్రవేత్తలు big bang theory ఒక పెద్ద విస్ఫోటం నుండి పుట్టిందని నిర్ధారిస్తున్నారు. ఇటువంటి విశ్వాలు అనేకం విష్ణువునుండి ఉద్భవించాయని వేదం ఘోషిస్తోంది. బ్రహ్మ నూరేళ్ళ ఆయుష్షు కలిగి ఉంటాడు. ఇటువంటి బ్రహ్మలు వేలకు వేలు ఇప్పటికి పుట్టి గతించారని వేదం చెబుతోంది. ఈ సృష్టి ఇప్పటికి ఎన్నో సార్లు జరిగిందని దీని అర్ధం.
నేడు మనం బ్రహ్మమానం ప్రకారం ఆయన 51వ సంవత్సరంలో కలియుగంలో ఉన్నాము. చతుర్ముఖ బ్రహ్మ గారి తరువాత బ్రహ్మ పదవిని అలంకరించబోయేది హనుమంతుల వారు. నేటి కాలమానానికి మన వేదవాంగ్మయం చెప్పబడిన ఈ బ్రహ్మాండ వయస్సును గణిద్దాం.
• బ్రహ్మమానం ప్రకారం ఆయనకు ఒక సంవత్సరానికి 360 రోజులు.
• బ్రహ్మగారి ఒక రోజును కల్పం అంటాము. అది ఆయన ఒక పగలు + రాత్రి.
• ఆయనకు ఒక పగలు = 14 మన్వంతరాలు. అలాగే రాత్రికి మరొక 14 మన్వంతరాలు.
• ఒక మన్వంతరం = 71 మహాయుగాలు. మనం ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాము.
• ఒక మహాయుగం = 4 యుగాలు. ( సత్య/ కృత + త్రేతా + ద్వాపర + కలి ). మనం ఇప్పుడు కలియుగం లో ఉన్నాము.
• సత్యయుగం = 1,728,000 మానవ సంవత్సరాలు (మహాయుగం లో 40% )
• త్రేతాయుగం = 1,296,000 మానవ సంవత్సరాలు ( మహాయుగంలో 30% )
• ద్వాపరయుగం = 864,000 మానవ సంవత్సరాలు ( మహాయుగంలో 20% )
• కలియుగం = 432,000 మానవ సంవత్సరాలు ( మహాయుగంలో 10% )
• 1 మహాయుగం = 4,320,000 మానవ సంవత్సరాలు
• 1 మన్వంతరం = 71 * 4,320,000 = 306,720,000 మానవ సంవత్సరాలు
• వేదాల ప్రకారం ప్రతి మన్వంతరం తరువాత ఒక 4 యుగాలు పునఃసృష్టికి కొంత ఖాళీ వుంటుంది. దానిని సంధికాలం అంటారు. సంధికాలం కృత యుగం అంత సమయం వుంటుంది (40% మహాయుగం)
• కావున బ్రహ్మ గారికి ఒక రోజులో బ్రహ్మ గారి పగలు = 14 మన్వంతరాలు + 15*40% మహాయుగం = 14*71 మహాయుగాలు + 6 మహాయుగాలు = 1000 మహాయుగాలు = 4.32 బిలియన్ ఇయర్స్
• అలాగే బ్రహ్మకు 1 రాత్రి = 4.32 బిలియన్ మానవ సంవత్సరాలు
• బ్రహ్మగారి 1 రోజు = 8.64 బిలియన్ మానవ సంవత్సరాలు
• మనం ఇప్పుడు 7వ మన్వంతరం లో ఉన్నాము. అంటే ఇప్పటికి 6 మన్వంతరాలు గడచిపోయాయి. = 71*6 = 426 మహాయుగాలు
• అలాగే 6 సందికాలాలు గడచిపోయాయి = 6*40% = 2.4 మహాయుగాలు
• మనం ప్రస్తుతం 28వ కలియుగంలో ఉన్నాము అంటే 27.9 మహాయుగాలు గడచిపోయాయి ( కలియుగం 10% of మహాయుగం )
• కావున మనం బ్రహ్మ గారి రోజులో 426+2.4+27.9 = 456.3 మహాయుగాలు దాటేసాము.
• అంటే 456.3 దివ్యసంవత్సారాలు అంటే 456.3 x 4,320,000 = 1,971,216,000 అంటే సుమారుగా 2 బిలియన్ సంవత్సరాలు.
నేటి కాలమానం ప్రకారం జీవుల సృష్టి 2 బిలియన్ సంవత్సరాలని రమారమి లెక్క కట్టారు
• ఒక బ్రహ్మగారి రోజు 2000 మహాయుగాలు.
• ఆయన 360 రోజులు = ౧ బ్రహ్మ సంవత్సరం = 360 * 2000 మహాయుగాలు = 720,000 మహాయుగాలు
• ఇప్పుడు మనం 51వ బ్రహ్మ సంవత్సరంలో ఉన్నాము అంటే 50*720,000 = 36,000,000 మహాయుగాలు
• ఇప్పుడు మనం 36,000,456.3 మహాయుగాలు దాటాక ఉన్నాము = *4320000 = 155,521,971,216,000 సంవత్సరాలు దాటి వున్నది.
• సుమారు 155,522 billion years. నేటి పరిజ్ఞానంలో ఇతిమిద్ధంగా 15-20 trillion ఇయర్స్ అయ్యుండవచ్చని కొందరు, కాదు 15-20 బిలియన్ ఇయర్స్ అని మాత్రమె ఒకరు, అదీ కాదు 13.82 బిలియన్ ఇయర్స్ అనిhttps://en.wikipedia.org/wiki/Age_of_the_universe వారి మోడలింగ్ చెబుతోంది.
దీనికి రెండు కారణాలు కావొచ్చు
౧. నేటి విజ్ఞాన పరిధి ఇంతమాత్రమే వుంది. ఇంకా దీని పరిధి మోడలింగ్ విస్తరించవలసి వుంది
లేదా
౨. మన వేదాలు ఈ లెక్కలు మహాసృష్టికి సంబంధించి లెక్క కట్టి ఉండవచ్చు. దానికీ ఇప్పుడు చూస్తున్న ఈ సృష్టికి 1000 రెట్లు బేధం ఉండవచ్చు.
ఈ సృష్టి ఒక అండాకారం (బ్రహ్మాండం) అని చెప్పగలిగింది మన వాంగ్మయం.
మనం వున్న ఈ భూమి గోళాకారం అని చెప్పగలిగింది మన వేదం. సృష్టిలో ఎన్నో రహస్యాలకు తాళం చెవి మన శాస్త్రాల్లో వున్నది. మనకు అది అర్ధం కాక దాని విలువ తెలుసుకోలేకపోతున్నాం.
ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు కార్ల్ సాగన్ ఇలా అన్నాడు: ఒక్క హిందూ మతం మాత్రమె ఈ ప్రపంచానికి మూలం తెలుప గలిగింది. ఈ ప్రపంచం సృష్టి లయల వలయం గా వున్నదని చాటి చెప్పిన ఒక గొప్ప శాస్త్రం. ఈ ప్రపంచం కొన్ని కోట్ల సార్లు పుట్టి మరల లయమయ్యి మరల పుట్టినది. ఈ మతం మాత్రమె విశ్వావిర్భావం గుట్టు విప్పగలిగింది.
The Hindu religion is the only one of the world’s great faiths dedicated to the idea that the Cosmos itself undergoes an immense, indeed an infinite, number of deaths and rebirths. It is the only religion in which the time scales correspond, to those of modern scientific cosmology. Its cycles run from our ordinary day and night to a day and night of Brahma, 8.64 billion years long. Longer than the age of the Earth or the Sun and about half the time since the Big Bang. And there are much longer time scales still. – Carl Sagan, Famous Astrophysicist

వీటిని మరింత శోధించి సత్యాన్ని తెలుసుకుని నలుగురితో పంచుకుందాం. మన వేదాలని నమ్ముదాం. బాగుపడదాం.

!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

1 COMMENT

  1. Very great article. Good work Sukanya Garu. Its true , At present our knowledge about the universe is little. there is so much unknown to human mind. I always felt like what our ancient people did is extraordinary work.
    I hope You will write much more articles to educate the visitors. what you did there is an amazing job.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here