అదృష్టవంతులుగా మారే అవకాశం | How to Become Lucky in Life Telugu

0
4730
\
అదృష్టవంతులుగా మారే అవకాశం | How to Become Lucky in Life Telugu

పంచశక్తులు మనిషిని నడిపించే ప్రకృతి శక్తులు. అయితే ఈ శక్తులు మానవులకు సంతోషాన్ని కొన్నిసార్లు నిరాశ, నిసృహలను కలుగజేస్తాయి.

కానీ ఫెంగ్‌షుయ్‌ని అనుసరించి గృహ నిర్మాణం, ఆఫీసు గదులను తీర్చిదిద్ది ఆ గదులలో కొన్ని అదృష్ట వస్తువులను ఉంచితే మరింత అదృష్టవంతులుగా మారే అవకాశం ఉందని ఫెంగషుయ్ శాస్త్రం వివరిస్తోంది.

నవ్వుతూ ఉండే బుద్దుడి ప్రతిమ ముఖ ద్వారానికి ఎదురుగా ఉంచితే ధన సంపదలతోపాటు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది.

బుద్దుడు సంపదలను ఇచ్చే దేవత. అందుకని 30 అంగుళాల ఎత్తుతో కూర్చుని ఉండేటటువంటి లాఫింగ్‌ బుద్ద ప్రతిమను ఇంట్లో ఉంచుకోవటం మంచిది.

అదే విధంగా చైనీయులు అతి పవిత్రంగా కొలిచే జంతువు డ్రాగన్‌. ఈ డ్రాగన్‌ ఉన్న చిత్రాన్ని గృహానికి లేదంటే ఆఫీసుకు తూర్పు దిక్కున ఉంచాలి.

డ్రాగన్‌ చిత్రం నుంచి అపరిమిత శక్తి మనలో ప్రవేశించి ఉత్సాహంగా పనిచేయగలుగుతామని ఫెంగషుయ్ వివరిస్తోంది. అలాగే దేవతా రూప చిత్రాల్లో ఫోనిక్స్‌ ఒకటి.

నిరంతర ప్రయత్నానికి, పట్టుదలకు ఈ పక్షిని ప్రతీకగా భావించవచ్చు. ప్రతి వ్యాపారవేత్త తన ఆఫీసు గదిలో దక్షిణ దిక్కున ఈ పక్షి తాలూకూ చిత్రాన్ని ఉంచితే నూతనోత్సాహం కలిగిస్తుంది.

జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సమర్థంగా ఎదుర్కోగలం.

ఫెంగషుయ్‌లో మరో అదృష్ట జంతువు మూడు కాళ్ల కప్ప. ఈ కప్ప నోటిలో నాణేలు మన ఇంటిలోకి ధనాన్ని తెస్తాయని చైనీయుల నమ్మకం.

అందుకే ఈ చిహ్నాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచాలని చెపుతారు. అయితే కప్ప ముఖం ఇంటి ముఖ ద్వారాన్ని కాక ఇంట్లోకి చూస్తూ ఉండాలి. వంటగదిలో, టాయిలెట్‌లో మాత్రం ఈ కప్ప ప్రతిమను ఉంచకూడదు.

కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అనుబంధాన్ని సృష్టించడంలో విండ్‌ చిమ్స్ ప్రధాన పాత్రను పోషిస్తాయి. అందువల్ల వీటిని ఇంటి ప్రధాన ద్వారం లోపల వేలాడదీస్తే ఆ ఇంట ఆరోగ్యం వెల్లివిరిస్తుంది.

ఫెంగషుయ్‌లో చైనా నాణేలు కూడా అదృష్టాన్ని తెచ్చిపెడతాయనే నమ్మకం ఉంది. మూడు చైనా నాణేలను గృహం లోపలి తలుపుకు ఎర్రటి దారంతో వేలాడదీస్తే అవి ఇంట్లోకి పెద్ద మొత్తంలో ధన సంచులను తెస్తాయి.

దీర్ఘాయుషుకు, ఉన్నత స్థితికి చైనా దేవతలైన ఫక్‌, లక్‌, సా దేవతలు సహకరిస్తారు. అందుకని ఈ దేవతా ప్రతిమల రూపాలను ఇంట్లో అమర్చుకోమని ఫెంగ్‌షుయ్‌ చెబుతోంది.

 
 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here