How to behave when we visit temples in Telugu / దేవాలయం కు వెళ్ళినపుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి ?
How to behave when we visit temples in Telugu శుభ్రత విషయం లో మరియు ప్రశాంతత విషయం లో జాగ్రత్తగా ఉండాలి
అంటే గట్టిగా అరవటం, నవ్వటం, మరియు ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం చేయరాదు. గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి.
కొబ్బరి పెంకులూ, అరటి తొక్కలు గుడిలో నియమించిన నిబంధనల ప్రకారం తోట్టిల్లోనే వేయాలి. త్రోసుకుంటూ లేదా ముందువారనిని దాటుకుంటూ దైవ దర్శనం చేసుకోరాదు. దేవుడ్ని కనులారా చూసి ఆ తరువాత కనులు మూసుకొని ప్రార్థన చేయాలి. గుడిలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి.
ఇంట్లో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివునికి ఎడమవైపూ, విష్ణువుకు కుడివైపూ చేయాలి. అమ్మవారిని నూనె దీపమయితే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడి వైపు వెలిగించాలి.
source: నాగవరపు రవీంద్ర
how to behave when we visit temples
memu kuda meku emina salhalu kavale ante evvagalanu sada me sevalo