
Vasthu Tips In Telugu
1. ఈశాన్య భాగం లో పల్లం వున్న గృహమును నిరభ్యంతరం గా కొనవచ్చు.
2. ఈశాన్య భాగం లో ఎత్తు గల గృహమును కొనరాదు.
3. తూర్పు భాగమున పల్లమున్న గృహమును కొనవచ్చు.
4. తూర్పు భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు.
5. ఆగ్నేయ భాగం లో పల్లమున్న గృహమును కొనరాదు.
6. ఆగ్నేయ భాగం లో నైరుతి కన్నా ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు.
7. దక్షిణ భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనడం మంచిది.
8. దక్షిణ భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు.
9. నైరుతి భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనవచ్చు.
10. నైరుతి భాగమున పల్లం కలిగి వున్న గృహమును కొనరాదు.
11. పశ్చిమ భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనవచ్చు.
12. పశ్చిమ భాగమున పల్లం కలిగి వున్న గృహమును కొనరాదు.
13. వాయువ్య భాగమున ఆగ్నేయం, నైరుతి కన్నా ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు.
14. వాయువ్య భాగమున పల్లం కలిగి వున్న గృహమును కొనరాదు.
15. ఉత్తర భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు.
16. ఉత్తర భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనవచ్చు.