పెళ్లి విషయంలో రాశుల పొంతన చూడడం ఎలా ? | Zodiac Sign Compatibility for Marriage in Telugu

1
40930
wedding-550389_640
పెళ్లి విషయంలో రాశుల పొంతన చూడడం ఎలా ? | Zodiac Sign Compatibility for Marriage in Telugu

వధూవరులకు జన్మరాశి లేదా, నామరాశి తెలుసుకొని షష్టాష్టకములు ద్విద్వాశము లేని రాశులవారు వివాహం చేసుకొనవచ్చును. అయితే మేష, వృశ్చికములు షష్టాష్టకములు అయినప్పటికీ రాశ్యాధిపతి కుజుడే అగుట చేత మంచిది నిస్సందేహంగా వివాహం చేసుకొనవచ్చును. అదేవిధంగా వృషభ, తులారాశులు షష్టాష్టకం అయినప్పటికి శుక్రుడు అధిపతి అయినందున నిస్సందేహంగా వివాహం చేయవచ్చును ఈ క్రింది రాశుల వారికి వివాహం కూడదు.

  1. మిధునం – మకరం
  2. కర్కాటకం – కుంభం
  3. సింహం – మీనం
  4. కన్య – మేషం
  5. వృశ్చికం – మిధునం
  6. ధనుషి – కర్కాటకం
  7. మకరం – సింహం
  8. కుంభం – కన్య
  9. మీనం – తుల
  10. వృషభం – ధనుషి.

ఈ రాశులైతే షష్టాష్టకములు అగును. అనగా కరి రాశి నుండి మరొకరి రాశి లెక్కించగా 6,8 కాకూడదు. అదేవిధంగా ద్విద్వాదశం. అంటే , ఒకరిరాశి మరొకరిరాశిని లెక్కించగా 2,12 కాకూడదు. అయితె ద్విద్వాశము నందు చేయుట వలన పెద్దగా చెడు ప్రభావము ఉండుట లేదు. ఆ దంపతులు అన్యోన్యంగానే యుండుట చాలా మందిని చూసియుంటిమి. కాబట్టి ద్విద్వాదశం అంతగా చూడనవసరం లేదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here