అమ్మవారికి నివేదన చేసే పాయసాన్నం ఎలా చేయాలి? | How To Cook Payasam to Offer Goddess in Telugu

0
2056
అమ్మవారికి నివేదన చేసే పాయసాన్నం ఎలా చేయాలి? | How To Cook Payasam to Offer Goddess in Telugu

అమ్మవారికి నివేదన చేసే పాయసాన్నం ఎలా చేయాలో చెప్పింది మన శాస్త్రం.

“తండులేషు క్షిపే క్షీరం

అయితే చిత్రమేమిటంటే ఈ శ్లోకాలన్నీ శివుడికి ఇవి నివేదన చేస్తే చాలా మంచిది అని ఉన్నాయి. అంటే ఇదే నివేదన శివుడికీ, శక్తికీ కూడా చేసుకోవచ్చు. అంతేకానీ శివారాధనకి చేయం అని కాదు. విష్ణ్వారాధనకి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చక్రాలకి సంబంధించి. విష్ణ్వారాధన చేస్తున్నప్పుడు కూడా విశుద్ధి చక్రం దగ్గర విష్ణు భావం వస్తుంది అంతే తేడా. శక్తి అని, విష్ణువు అని పేరు మారింది కానీ శక్తి మారదు. అందుకే పాయసాన్న ప్రియా అన్నప్పుడు ఇది శివుడికి ఇలా చేసి పెట్టాలి అని మంత్రశాస్త్రం చెప్తోంది.

“తండులేషు క్షిపే క్షీరం ద్విగుణంవా తదర్థకం!
అలాభే విన్యసేత్తోయం తస్యార్థం గో ఘ్రుతం పరం!
తండులార్థాన్ భిన్న ముద్గాన్ గుడం విన్యస్య పాచయేత్
నివేదయేత్ తతో మంత్రీ పాయసాన్నం శివాయ చ!!

ఇలా పెట్టి పాయసం నైవేద్యం పెట్టాం అని అప్పుడు అనాలి. కొంతమంది సేమ్యాలు తెచ్చి పాయసాలు పెడుతూంటారు. కూడడది. దేవతా నివేదనకి సేమ్యా పనికిరాదు. పిల్లలు సరదాగా పంచుకొని తినడానికి పనికి వస్తుంది తప్ప. అవన్నీ శాస్త్ర నియమాలు.

తండులేషు క్షిపే క్షీరం – బియ్యంలో పాలు వేసి; దాని తరువాత అందులో వేయవలసినది గుడం – బెల్లం; భిన్నముద్గాన్ – అంటే పెసలు – ముక్క చేసిన పెసలు/పెసరపప్పు; గోఘ్రుతం – ఆవునెయ్యి వేసి వండితే దానిని పాయసం అంతే కానీ చక్కెర వేసేస్తా అంటే కూడదు. ఎందుకంటే పటిక బెల్లం వరకూ మన శాస్త్రం చెప్తోంది కానీ పంచదార అనేది తర్వాత వచ్చింది. మరొక న్యూస్ ఏంటి అంటే పంచదార ఫ్యాక్టరీ వచ్చిన తర్వాతే షుగర్ వ్యాధి వచ్చిందిట. Indiaలో మొట్టమొదట మిరపకాయలు కానీ పంచదార కానీ లేదు. ఆరోగ్యానికి అంతవరకే అని చెప్పారు. అమ్మవారికి గుడం మాత్రమే. అంతేకానీ పటికబెల్లం చెప్పలేదు. శర్కర అని వస్తే పటికబెల్లం. ఇక్కడ మాత్రం బెల్లమే. అది వేస్తే అది పాయసాన్నం. ఇలా చేసి నివేదన చేయాలిట. గో ఘ్రుతం అంటే చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆవు నెయ్యి. ఆవు అనగా భారతీయ సంతతికి చెందిన గోవు మాత్రమే. జెర్సీ కాదు. జెర్సీ ఆవు కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here