నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? 

0
590

నవరాత్ర వ్రతం పూర్తి అయినతర్వాత ఉద్వాసన అంటారు దానిని. ఉద్వాసన అంటే మళ్ళీ తమయొక్క నెలవులకు పంపుట అని అర్థం. అమ్మవారిని ఆరాధించినపుడు ఎక్కడినుంచో తీసుకురారు. సర్వవ్యాపిని యైనటువంటి శక్తిని మనం మంత్రం ద్వారా భావన ద్వారా మననుండే అందులో ఆవహింపజేస్తాం. 

అటుతర్వాత ఆ జగదంబను వివిధ విధములుగా ఆరాధించిన తర్వాత ఏ బింబమునందు ఆరాధించామో ఆ బింబములోని శక్తి మనం స్వీకరించితే మన హృదయంలో అమ్మవారు ఉండి మనలను అనుగ్రహిస్తారు. అందుకు ఆ కలశాన్ని ఉద్వాసన చెప్తారు. అనగా కలశంలో ఉన్న శక్తిని తిరిగి మనలోపలకి స్వీకరించి ఆ కలశమును ఇంక కదుపుతారు. ఇది ఎప్పుడు చేయాలంటే ‘శ్రవణేన విసర్జయేత్’ అని చెప్పినట్లుగా నవమి ఉన్నప్పటికీ శ్రవణా నక్షత్రంలో కూడి ఉన్నప్పుడు ఆరోజునే విసర్జించాలి అని చెప్పారు.

ఆవిధంగా బింబమును తొలగించి బింబములోని శక్తిని మనలోకి స్వీకరిస్తాం. ఇది ఉద్వాసన కలశాన్ని కడపడంలో ఉన్న ఆంతర్యం.

శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dasara Pooja Vidhanam in Telugu