
How to Do Worship In Telugu
1దేవుని పూజ కు ఉపయోగించి న పీటను(ఆసనమును) మరియొక పనికి ఉపయోగించ రాదు
2దీపారాధన శివుని కి ఎడమ వైపు, విష్ణువు నకు కుడి వైపు చేయవలెను ఎదురుగా మాత్రం చేయరాదు
3గో పూజ చేయునప్పు డు ముందుగా తోక కు పూజ చేయాలి
4శివాలయం లోకి నందీశ్వరుని ప్రార్ధించిన పిదప మాత్రమే వెళ్ళాలి
5ఉదయ దీపారాధన ఎంత పుణ్యమో సాయంకాల దీపారాధన అంత కన్నా పుణ్యం. కావున రెండు సమయాలలోను దీపారాధన చేయవలెను
6స్త్రీ నిత్యము తులసి పూజ చేసిన సౌభాగ్యము కలుగును 7 ప్రతి నిత్యము శివునకు మారేడు పత్రి తో పూజ చేసిన శివానుగ్రహము కలుగును
8ఇంట్లొ ఎవరికైన ఎక్కువగా జబ్బుగా ఉన్నప్పుడు మూడు రంగుల దారము ను ఏడు పేటల ఒత్తిగా చేసి మట్టి ప్రమిద లలో వేసి నెయ్యి, నూనె, ఆముదము కలిపి పోసి దీపారాధన చేసిన అపమృత్యు దోషము పోవును
9 తీర్థము కుడి చేతితో మాత్రమే తీెసుకొనవలెను
10 తీర్ధము గుడి లో నిలబడి, ఇంట్లో ఇంట్లో కూర్చుని తీెసుకొనవలెను
11 భోజనం చేయి కంచము లలో అక్షింతలు కలుపరాదు పూవులు ఉంచరాదు
12 విష్ణువును తులసి దళం తో పూజించాలి
13ఏ రోజు కోసిన పువ్వులు ఆ రోజే పూజ చేయవలెను 14ఏ రోజు చేసిన అక్షింతలు ఆ రోజు న పూజ చేయవలెను 15 పరుల చెట్ల పువ్వులు కోసి పూజ చేసిన పూజా ఫలము చెట్లు గల వారికే దక్కును