వినసొంపైన స్వరాన్ని పొందాలంటే..? | How to Get Beautiful Voice

0
8583
వినసొంపైన స్వరాన్ని పొందాలంటే.
వినసొంపైన స్వరాన్ని పొందాలంటే..? | How to Get Beautiful Voice

వినసొంపైన స్వరాన్ని పొందాలంటే..? | How to Get Beautiful Voice

వినసొంపైన స్వరం కావాలని కోరుకోని వారుండరు. గొంతు సమస్యలు తీరడానికీ, గంభీరమైన, సుస్వరమైన కంఠాన్ని పొందటానికి సహజమైన సంప్రదాయబద్ధమైన పరిష్కారం శంఖముద్ర .

శంఖ ధ్వానం తో భగవంతుని ఎలా మేల్కొలుపుతామో అదేవిధంగా శరీరమనే దేవాలయం లో దైవత్వాన్ని మేల్కొపేది శంఖముద్ర. శంఖ ముద్ర ద్వారా ఆందోళనలు తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది.

1. శంఖ ముద్ర ఎలా వేయాలి.

  • సుఖాసనంలో గానీ పద్మాసనంలో గానీ లేక వజ్రాసనంలో గానీ వెన్ని నిటారుగా ఉంచి కూర్చోవాలి.
  • కుడిచేతి నాలుగు వేళ్ళతో పటం లో చూపించిన విధంగా ఎడమచేతి బొటనవేలిని చుట్టి ఉంచాలి.
  • కుడిచేతి బొటన వేలిని ఎడమచేతి మధ్య వేలిని తాకేలా ఉంచాలి.
  • కుడిచేతి వేళ్ళ మధ్యలో ఉన్న బొటనవేలిని ముత్యం లా భావించాలి.
  • ఎడమ చేతి మధ్యవెలుని తాకుతున్నా కుడి బొటన వేలిని మీలోని ఉన్నతమైన శక్తిగా భావించాలి.
  • ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నాభి స్థానం నుంచీ ధ్వనించేలా ఓం కారాన్ని నెమ్మదిగా దీర్ఘంగా జపించాలి.
  • శ్వాసకూడా దీర్ఘంగా ఉండేలా చూసుకోవాలి.
  • గొంతు సమస్యలకు నివారణ కోసం కానీ, శ్రావ్యమైన గొంతును పొందాలనుకునేవారు కానీ ఈ ముద్రను రోజుకు మూడు సార్లు సాధన చేయాలి.
  • కనీసం పదిహేను నిముషాలపాటు శంఖ ముద్రను సాధన చేయడం ద్వారా పూర్తి లాభాలను పొందుతారు.
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here