How to Heal Cracked Feet Tips in Telugu
పాదాల పగుళ్లను నివారించడానికి
నీళ్లల్లో ఎక్కువగా నానడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీనికి తోడు ఆ పగుళ్లలోకి మట్టి ఇసుక వంటివి చేరకుండా జాగ్రత్తపడాలి.
ఓ పాత టూత్ బ్రష్ తీసుకుని మొదట పగుళ్లను శుభ్రం చేయాలి. ఆ తర్వాత బాదం నూనె ఆలివ్ ఆయిల్ లేదా కోల్డ్ క్రీమ్, వ్యాసలైన్ లలో ఏదో ఒకటి రాయాలి, తర్వాత పాత సాక్స్ తొడిగేయాలి.
రాత్రి నిద్రించే ముందు ఈ పనిచేస్తే ఉదయానికి చర్మం మెత్తబడుతుంది. అప్పుడు ఓ ఫ్యూమిస్ స్టోన్ తీసుకుని పగుళ్ళ ప్రాంతంలో రుద్దితే డెడ్ స్కిన్ ఊడిపోతుంది.
తర్వాత ఏదైనా క్రీమ్ రాసుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. సాధారణంగా శీతాకాలంలో ఈ సమస్య ఎదురవుతుంది. కాబట్టి సాక్స్ ధరించడం మాత్రం మానకూడదు.
గోరువెచ్చని నీరు తీసుకొని అందులో నిమ్మరసం కొన్ని చుక్కలు చేర్చి మీ పాదాలను 5-10నిమిషాలపాటు అందులో ముంచాలి(పాదాలు పూర్తిగా మునిగేటట్లు చేయాలి).
తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి ఆపై మాయిశ్చరైజర్ రాసి తర్వాత నిద్రకు ఉపక్రమించాలి.
తేనెలో తేమనందించే, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ఇవి పాదాల పగుళ్లను పోగొట్టి మృదువుగా మారుస్తాయి.
పావు బకెట్ నీళ్లలో నాలుగు చెంచాల తేనె కలిపి పాదాలను పావుగంట పాటు నానబెట్టాలి. తర్వాత పాదాలను స్క్రబ్ చేసి కడిగితే, పగళ్లు తగ్గుతాయి.
గోరువెచ్చని నీటిలో తేలికపాటి షాంపూను కొన్ని చుక్కలను వేసి, అందులో మీ పాదాలను కొద్దిసేపు నానే విధంగా చూసుకోవాలి.
తర్వాత ప్యూమిస్ స్టోన్ (సున్నితమైనటువంటి రాయి)తో రుద్ది శుభ్రపరుచుకొంటే చర్మం మీద ఉండే పొడిబారిన, రఫ్ గా ఉన్న కణాలు తొలగిపోయి పాదాలను సున్నితంగా, నునుపుగా మారుతాయి.
షాంపూతో శుభ్రం చేసుకొన్న తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ లేదా నూనెను రాయడం మర్చిపోకండి.
చెంచా ఆలివ్ నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించినా ఫలితం ఉంటుంది.
రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెని పాదాలకు పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
ఇలా ప్రతిరోజూ చేస్తే కాళ్ల పగుళ్లు మాయమవుతాయి. గోరువెచ్చని నీళ్లలో బేకింగ్ సోడా రెంచు చెంచాలు వేసి అందులో పాదాలు నాన్చి శుభ్రం చేస్తే మృతకణాలు తొలగిపోయి. పాదాలు సున్నితంగా తయారవుతాయి.
ఇది ఒకరకంగా సహజసిద్దమైనటువంటి ఔషదంలా పనిచేసి కాలుకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి.
పాదాల పగుళ్ళను నివారించుకోవడానికి కొబ్బరి నూనె బాగా సహాయపడుతుంది.
ఈ నూనెను ప్రతి రోజూ రెగ్యులర్‌గా ఉపయోగిస్తుంటే పాదాల పగుళ్ళు నివారించి చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే వేసవిలో చర్మం ప్రకాశవంతంగా ఉండాలంటే కొబ్బరి నూనె శరీరానికి అప్లై చేస్తే సరిపోతుంది.
కొన్ని చుక్కల నూనెను స్నానం చేసే నీటిలో వేస్తే మంచి ఫలితం ఉంటుంది. అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్లపై రాసి పదినిమిషాలు ఉంచి, తర్వాత నీటితో శుభ్రపర్చుకుంటే మడమలు మెత్తబడతాయి.
గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి అందులో పాదాలను ఉంచాలి.
పది నిమిషాల తరువా మామూలు నీటితో శుభ్రపరుచుకుంటే పగుళ్ల వల్ల ఉండే నొప్పి తగ్గుతుంది. ప్రతిరోజూ సాయంత్రం రోజ్‌వాటర్‌ను కాళ్ల పగుళ్లపై రాసి మౄఎదువుగా మర్దనా చేసినా ఫలితం ఉంటుంది.
పాదాలకు కొబ్బరినూనె గానీ, ఆముదం గానీ రాసి వాటిని వేడినీటిలో పెట్టి అలా 20-25 నిమిషాలు ఉంచండి. ఈలోపు వేడి నీటిలో ఆ మట్టి కరిగి మొద్దుబారిన చర్మం మెత్తబడుతుంది.
పాదాలను వేడి నీటిలో నుంచి బయటికి తీసి, బట్టలు ఉతికే బ్రష్ తో పగిలిన భాగంపై రుద్దాలి. నానిన చర్మం శుభ్రంగా ఊడి తేలిగ్గా వచ్చేస్తుంది.
ఇలా ఆ చర్మాన్ని మనం తీసేయడం వల్ల అక్కడ కొత్త చర్మాన్ని శరీరం తయారుచేస్తుంది.
పాదాలను శుభ్రంగా తుడిచి, వాటికి మళ్లీ కొబ్బరి నూనె రాయండి. ఇలా రాయడం వల్ల ఆ చర్మం మెత్తగా రోజంతా బిరుసెక్కకుండా ఉంచుతుంది.
అవకాశమున్నవారు రోజూ బూట్లు వాడగలిగితే మెత్తగా ఉండి పగుళ్లు రాకుండా ఉంటాయి.
పగుళ్లు లేనివారు పగుళ్లు రాకుండా ఉండాలంటే వారానికి రెండుసార్లు స్నానానికి వెళ్లేముందు కొబ్బరి నూనె రాసుకుని, స్నానం చేసేటప్పుడు పాదాలను బ్రష్ తో రుద్దితే ఆ భాగంలో మట్టిపోయి శుభ్రంగా ఉంటాయి.
స్నానం అయ్యాక కొంచెం కొబ్బరి నూనె రాస్తే చాలు పాదాలు అందంగా మెత్తగా తయారవుతాయి.