శనీశ్వరుని కి నువ్వుల నూనె తొ దీపం ఎలా వెలిగించాలి? | Why to Light a Lamp for lord Shani With Sesame Oil in Telugu

0
4655

diya-2009

చాలా మంది ఏలి నాటి శని ప్రభావం వలన చాల బాధ పడుతుంటారు ఇంకా కొంత మంది ఏ పని మొదలు పెట్టిన అనుకోని ఆవాంతరాలు , ఇబ్బందులు వస్తుంటాయి. ఇంకా కొంతమంది కి వివాహ ప్రయత్నలలో ఆటంకాలు ఇలాంటి సమస్యల తో బాధ పడుతున్న వారు

ఈ క్రింది విధంగా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది

ఒక శని వారం నాడు నవగ్రహాలలో శనీశ్వరుల దగ్గర కాని. రావి చెట్టు వద్ద గాని నువ్వుల నూనె తో దీపం వెలిగిస్తే ఏలి నాటి శని ప్రభావం నుండి బయట పడవచ్చు

శనీశ్వరుల వారికి బెల్లం ఆంటే చాలా ప్రీతి శని కి బెల్లాన్ని ప్రసాదం గా నివేదించడం వలన కూడా శని ప్రభావం తగ్గుతుంది

అలాగే నల్లని గుడ్డ లో నువ్వులు వేసి మూట కట్టి ఆ మూటను నల్లటి ప్రమిద లో పెట్టి ప్రమిద వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన శని ప్రభావం నివారణ అవుతుంది. ఇలా చేసిన తరువాత నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి శు బ్రం గా కాళ్ళు, చేతులు కడుకొని శివాలయం కానీ హనుమంతుని ఆలయం కాని దర్శనం చేసుకొని రావాలి. ఇలా ప్రతి శనివారం నాడు ప్రత్యేకించి శని త్రయోదశి నాడు చేయడం వలన శని తీవ్రత తగ్గుతుంది . ఈ విధంగా చేయడం వలన పనులలో అడ్డంకులు. వివాహ విషయం లో ఆటంకాలు తొలగి పోతాయి.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here