
Fasting on Shivaratri
1. శివరాత్రి ఉపవాసం
శివరాత్రి నాడు ఉపవాసం ఏవిధంగా చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు? అసలు శివరాత్రినాడు తప్పని సరిగా ఉపవసించాలా..? ఉపవాసం చేయలేకపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందా..? ఈ ప్రశ్నలు ఎంతో మందిని వేధిస్తుంటాయి.
మహా శివరాత్రి పర్వదినాన అతిముఖ్యమైనవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివ రాత్రి విశేషం ఏమిటంటే, శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండీ వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. శుభాన్నీ సుఖాన్నీ ప్రదానం చేసేది శివరాత్రి. శివరాత్రినాడు ఉపవాసవ్రతం చేస్తే వారికి అశ్వ మేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శివపురాణం లో చెప్పబడింది. శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేసినవారు అఖండ ఐశ్వర్యాలను పొంది, జన్మాంతం లో జీవన్ముక్తులౌతారని స్కాంద పురాణం చెబుతోంది. తనకు ఏపూజ చేసినా చేయకున్నా కేవలం ఉపవాసం చేయడం వలన ఆ ఫలితాలన్నీ పొందగలరని మహాదేవుడే పార్వతితో అంటాడు.
శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!
శివరాత్రి నాడు అంటే మాఘ కృష్ణ చతుర్థినాడు ఎవరైతే శివపూజ చేస్తారో, వారు మరొకసారి తల్లి పాలను తాగ లేరని అర్థం. అంటే వారు శివపూజా ఫలం వల్ల జన్మాంతం లో శివైక్యం పొంది మళ్ళీ జన్మ ఉండదని భావం.
Really it is important page…its useful lines for everyone who really belive lord shiva