
Shadha Pournami Vratham In Telugu
ఆషాఢ పౌర్ణమి వ్రతం ఎలా ఆచరించాలి?
Shadha Pournami Vratham In Telugu – జ్యేష్ట, ఆషాఢ, కార్తీక,ఫాల్గుణ పౌర్ణములకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజులలో చేసే జప, తప, ధ్యాన, హోమాలు మరియు పితృకార్యాలు, విశేష ఫలితాన్నిస్తాయి. ముహూర్త చింతామణిని అనుసరించి ఆషాఢ పౌర్ణమిరోజున చంద్రుని ఆరాధించడం వలన అనేక శుభాలు కలుగుతాయి.
ఆషాఢ పౌర్ణమి రోజున సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు ముగించుకుని శివారాధన చేయాలి. ఉపవాస దీక్షను ప్రారంభించాలి. గ్రహదోషాలను అనుసరించి ధాన్యాన్ని,లేదా వస్త్రాన్ని దానం చేయాలి. పితృదేవతలకు ప్రీతికలిగించేటట్లుగా అన్న సంతర్పణలు, పితృ కార్యాలు చేయాలి. చంద్ర దర్శనం చేసుకున్న తరువాత ఉపవాసాన్ని విరమించి ప్రసాదాన్ని స్వీకరించాలి.
శుభం.