భగవంతుడిని ఏమి కోరుకోవాలి | What Should We Pray God

1
12441
images
What Should We Pray God

What Should We Pray God

భగవంతుడిని మనం ఫలానా కావాలి అని కోరుకోకూడదు.

ముఖ్యంగా ధనం కావాలి అని అస్సలు కోరుకోకూడదు. కావలసినంతడబ్బు ఉండీ, అది మన దగ్గర నిలవక పోతే? లేదా, డబ్బు ఒక పరిమితిని మించి ఉండీ, మనకు దానిని అనుభవించే ఆరోగ్యం లేకపోతే? లేదా, ఆ డబ్బు వలన మనకు శతృ బాధలు కలిగితే? లేదా పిల్లలు డబ్బు ఎక్కువై, చెడుమార్గాలు పడితే? ఆ డబ్బు కారణంగా అన్నదమ్ములతోనూ, ఇతర బంధువులతోనూ గొడవలు వస్తే? గృహంలో అశాంతి పెరిగితే? ఎంత డబ్బు , అధికారం ఉన్నప్పటికీ ఒక్కోసారి పట్టెడన్నం దొరకక బాధపడతాం. కంటినిండా కునుకు లేక బాధ పడతాం. మనశ్శాంతి కోల్పోతాం. అందుకే భగవంతుడిని ఎప్పుడూ సుఖమయమైన, సౌకర్యవంతమైన, సంతృప్తి కలిగిన జీవితాన్ని కోరుకోవాలి. మనం తినడమే కాకుండా, పదిమందికి సహాయం చేయగల బుధ్ధిని, వీలునీ కల్పించమని వేడుకోవాలి. అనాయాస మరణం కోరుకోవాలి. బ్రతికినన్నాళ్ళూ ఒకరి దగ్గర చేయి చాచకుండా బ్రతికే వరాన్ని కోరుకోవాలి. కష్టాల్లో మనలను ఓదార్చే పదిమంది స్నేహితులను, మన సంతోషంలో పాలుపంచుకుని, మన అభివృధ్ధికి ఆనందించే ఇరుగుపొరుగును, బంధువర్గాన్నీ కోరుకోవాలి. ఎప్పుడూ ధర్మం తప్పకుండా నడవగలిగే ఆత్మస్థైర్యాన్ని కోరుకోవాలి. ధర్మ మార్గాన నడిచేవారికి భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here