
* How to Prevent Craked Heel – గుగ్గిలము, వెన్నపూస లొ కలిపి రాస్తే పగుళ్లు తగ్గుతాయి .
* మర్రిపాలు పగుళ్లు కు రాస్తే తగ్గిపోతాయి .
* నీరుల్లిపాయల రసం అరికాళ్ల పగుళ్ల కు రుద్దిన చాలా ఉపయోగం .
* మామిడి చిగుళ్లు కాచి కట్టితే పగుళ్లు మాయం అయిపొతాయి.
* ఆముదం పిండి రాసిన కాళ్ల పగుళ్లు తగ్గిపోతాయి .
* మామిడి జిగురు పగుళ్ళలో పెట్టి నిప్పుతో వెచ్చ చేసిన పగుళ్ల బాధ తగ్గిపొతుంది.
* గుగ్గిలం 50 గ్రా , ఆవనూనె 50 గ్రా ఈ రెండు కలిపి వేడిచేసి కరిగించాలి.తరువాత అందులో కొంత మంచి నీరు కలిపి మర్దిస్తే అది వెన్నవలే తయారువుతుంది. ఆ వెన్నను పాదాలకు రాస్తూ ఉంటే పగుళ్లు తగ్గిపోతాయి .
* జీలకర్రను మట్టి మూకుడులో వేసి పొయ్యి మీద పెట్టి నల్లగా మాడ్చాలి. తరువాత దానిని చూర్ణం గా దంచి వస్త్ర గాలితం చేసి పూటకు అర టీస్పూన్ చొప్పున రెండు పూటలా మంచి నీళ్లతో సేవిస్తూ ఉంటే కాళ్లు పగిలి చీము ,నెత్తురు కారడం వంటి బాధలు పొతాయి.
** కాళహస్తి వెంకటేశ్వరరావు ***
చాలా సంతోషం