శని దోషం మిమ్మల్ని బాధించకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? | How to Prevent Shani Dosa Telugu?

1
8338
శని దోషం మిమ్మల్ని బాధించకుండా ఉండాలంటే ఏమి చేయాలి.
How to Prevent Shani Dosa Telugu

How to Prevent Shani Dosa Telugu – శని దోషం తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్యారాధన, శివపూజ, శని కి తైలాభిషేకం చేయడం, ఇలా మన సంప్రదాయం లో శని దోష నివారణకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటన్నిటిలాగే శని దేవుడు ఎంతటి దోష కారకమైన స్థానంలో ఉన్నా సరే మిమ్మల్ని  బాధించకుండా ఉండాలంటే మరొక అద్భుతమైన పరిష్కారం ఉంది. అది స్వయంగా శనిదేవుడే చెప్పిన పరిష్కారం.

ఎవరైతే పరమ శివుని ప్రతిరోజూ ధ్యానిస్తారో అటువంటివారికి శని దోషాలు అంటవు. అలాగే కష్టపడి పనిచేసేవారికి ఎప్పటికీ ఇబ్బందులు కలుగజేయనని శని దేవుడు తానే స్వయంగా చెప్పినట్లు జ్యోతిష పండితులు కూడా అంగీకరించారు. సోమరితనాన్ని వీడి ఎవరైతే తమ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారో, ఎవరైతే పాప భీతి కలిగి ఉంటారో, ఎవరైతే పుణ్యకార్యాల పట్ల ఆసక్తులై ఉంటారో, ఎవరైతే భగవంతుని ధ్యానిస్తారో అటువంటి వారికి శనిదేవుడు ఏ స్థానం లో ఉన్నా హాని చేయడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here