వాస్తు దోషాల నివారణకు | How to Prevent Vastu Dosha in Telugu

0
10553
వాస్తు దోషాల నివారణకు | How to Prevent Vastu Dosha
వాస్తు దోషాల నివారణకు | How to Prevent Vastu Dosha

How to Prevent Vastu Dosha

మానవుని ఆలోచనలకు తగినట్టు గృహాన్ని అలంకరించుకోవాలని తెలుసుకున్నాము. గృహంలో మనకు మరింతా అనుకూలమైన వాతావరణం కోసం పలు మార్గాలు ఉన్నాయి.

హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి 9 అవతారాల్లో మత్స్యావతారం ఒకటి. దీని ద్వారా మానవ రూపంలోని దేవతలతోపాటు భూమండలం మీద వున్న సకల చరాచర జీవులన్నీ పూజకు అర్హులే అని పురాణాలు చెప్పకనే చెప్పాయి.

సైన్స్ ఏం చెబుతోందంటే చేపలు అత్యంత ప్రమాదకరమైన నెగెటివ్ తరంగాలను తమలో ఇముడ్చుకొని చాలా చక్కటి అనుకూల తరంగాలను బయటికి విడుదల చేస్తాయని తెలియజేస్తుంది.

ఇలా జరగాలంటే ఇంట్లో కుల మత భేదం లేకుండా ఫ్యాన్సీ చేపలను పెంచేందుకు అక్వేరియం ఉండాలి.

ప్రతికూల ఆలోచనలు, చెడుగాలులు, ఆత్మలకు సంబంధించిన అనుమానాలు, నిద్రలేమి రాత్రులను, ఆర్థిక ఇబ్బందులను, సంతాన లేమిని ఈ చేపల అక్వేరియం పారద్రోలి అదృష్టాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.

కచ్చితమైన అదృష్టం మీ ఇంటి తలుపులు తట్టాలంటే మీ ఇంట్లో అక్వేరియం ఉండాలి. దాంట్లో సరిగ్గా 9 చేపలు మాత్రమే ఉండలా. వాటిలో 8 డ్రాగన్ చేపలు కాని, లేదా 8 గోల్డ్ ఫిష్‌లు కాని ఉండి తీరాలి. ఒకటి మాత్రం కచ్చితంగా నల్లటి రంగు ఫిష్ ఉండి ఉండాలి.

డ్రాగన్ చేపలు, గోల్డ్ ఫిష్‌ల స్వభావం ఏమిటంటే మీ ఇంటి నుంచి దూరమైపోతున్న అదృష్టాన్ని, పతనమై పోతున్న మీలోని పవర్‌ని నిలువరించే శక్తిని కలిగి ఉన్నాయి.

ఇక పొరపాటున మీ అక్వేరియంలోని ఏదైనా చేప చనిపోతే కంగారు అక్కర్లేదు. అలా జరగటం వల్ల మీ ఇంటి నుంచి చెడును ఆ చనిపోయిన చేప తన ద్వారా తీసుకెళ్లిందని భావించవచ్చు. వెంటనే మరో చేపని అక్వేరియంలోకి జార విరవండి.

ఇలా చేయడం వల్ల మీరు శుభాలకి మార్గం సుగమం చేసుకున్నట్లే. ఆ చనిపోయిన చేపని ఇంటి బయట మట్టిలో పాతేయండి. అపార్ట్‌మెంట్‌లో ఉండేవారయితే మీ అపార్ట్‌మెంట్ బయట రోడ్డు మీద పాతేయండి.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏ చేప చనిపోయిందో తిరిగి అలాంటి చేపనే అక్వేరియంలో ఉంచండి. అక్వేరియంతో పాటు ఇంట్లో పిల్లిని కూడా పెంచితే మరీ మంచిది. ఈ రెంటికీ దుష్ట శక్తులు భయపడతాయి.

అక్వేరియం ఎలా ఉండాలి?
పంచభూతాలైన.. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ఇవన్నీ అక్వేరియంలో ఉండేలా చూడాలి.

ముందుగా అక్వేరియమ్‌ని స్వచ్ఛమైన నీటితో తగినంత పరిమాణంలో నింపాలి. అక్వేరియమ్ లోపలి భాగంలో చిన్న చిన్న మొక్కలను ఏర్పాటు చేయాలి.

అక్వేరియం లోపల ఏదైనా లోహంతో ఆకృతి ఏర్పాటు చేయాలి. రాళ్లు, గులకరాళ్లను లోపల అడుగుభాగాన ఏర్పాటు చేయాలి.

ఐదవ అంశం అగ్ని. దీనికి గాను లోపలి వైపు లైట్‌ను ఏర్పాటు చేయాలి. దీపకాంతిలో చేపలు రంగురంగులుగా కనిపిస్తాయి.

అక్వేరియం ఉండాల్సిన ప్రదేశం
గృహంలో అక్వేరియం ఉండగానే సరిపోదు. దాన్ని వాస్తుకు తగ్గట్టుగా సరైన ప్రదేశంలో ఉంచాలి. అప్పుడే దాని ఫలితం మీ ఇంటిని అదృష్టలక్ష్మి వరించేట్టు చేస్తుంది.

మన సొంత ఇల్లు కదా అని అక్వేరియమ్‌ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మీ ఇల్లు గుల్లైపోతుంది. దాన్ని ఉంచే కరెక్ట్ ప్రదేశం డ్రాయింగ్ రూమ్.

అక్కడ కూడా వాస్తు ప్రకారం తూర్పు దిశగా కాని, ఉత్తర దిశగా కాని ఉండాలి.

రాత్రిళ్లు చేపల సౌందర్యం చూద్దాం కదాని వెరైటీ కోసం బెడ్‌రూంలో అక్వేరియంని ఉంచారనుకోండి. దంపతుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలవుతాయి.

కుటుంబం సమస్యల్లో పడే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు జరుగుతాయి. వంటింట్లో ఉంచితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కాలు దువ్వుతుంది. అందుకనే చేపలే కదా అని వాటిని ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ పెంచుతుంటే నిండా మునిగిన వారవుతారు.

ఒక్క అక్వేరియం లివింగ్ రూమ్ లో ఆగ్నేయ దిశగా కాని, ఉత్తర ముఖంగా కాని ఉంచాలి. అంతేకాదు అక్వేరియంలో శంఖాలు, ఆలుచిప్పలు, గవ్వలు, గులకరాళ్లు నైరుతీ దిక్కులోనే ఎక్కువగా ఉంచడం మంచిది.

అక్వేరియం కొలతలు
అక్వేరియం కొలతలు కూడా ముఖ్యమే. అక్వేరియం ఉంచే గదిలో గది సైజులో మూడవ వంతు సైజు దాటి ఉండరాదు.

అలాగని మరీ చిన్నదీ పనికిరాదు. దానివల్ల ఫలితాలు అస్సలు రావు. పెద్ద అక్వేరియం అయితే దాన్లో నింపే నీటి ద్వారా మంచి ఫలితాలుంటాయి. అక్వేరియం మీద ఎప్పుడూ అగ్గిపెట్టెలు, క్యాండిల్స్ వెలిగించి పెట్టొద్దు.

ఇలా చేయటం వలన ఆగ్నేయ భాగాన్ని వెక్కిరించినట్లవుతుంది. రూపాయి నాణేలని అక్వేరియం మీద ఉంచితే చాలా మంచిది.

అద్దాలతో చేసిన, అక్రెలిక్ పదార్థంతో చేసిన అక్వేరియంలు మాత్రమే గృహ వాస్తుకు తగ్గట్టుగా ఉంటాయి. అక్వేరియం బరువు కూడా ఇంటి వాస్తు మీద ప్రభావం చూపుతుంది.

అక్వేరియంని ఏ రోజుకారోజు పూలతో తాజాగా అలంకరిస్తుంటే చాలా మంచిది. ఇలా చేస్తుంటే పాజిటివ్ ఎనర్జీ వెలుగులోకి వస్తుంటుంది.

కొత్తకొత్త ఆలోచనలు ఎల్లవేళలా మిమ్మల్ని పలకరిస్తంటాయి. అక్వేరియంలో ఆక్సిజన్ ఎంత పరిమాణంలో వస్తుంటుందో, అలానే మీకు శుభాలు జరుగుతుంటాయి.

అక్వేరియం ఎదురుగా దుష్ట జంతువుల బొమ్మలు అస్సలు ఉంచొద్దు. డ్రాగన్, పులి, అనకొండ, సింహం వగైరా వగైరా బొమ్మలు, సమయానికి తగ్గట్టుగా అక్వేరియంలోని పాత నీరును తీసేసి కొత్త నీరును నింపుతుండండి.

ఇలా చేయటం వలన జల వాస్తు పద్ధతి ప్రకారం అనుసంధానం అవుతుంటుంది. ఆకుపచ్చని నీటి మొక్కలను వాస్తు దిశానుగుణంగా అక్వేరియంలో ఉంచండి.

ఎన్ని పూజలు చేసినా ఫలితం లేకుండా మీ ఇంట్లో కాని, ఆఫీసులో కాని సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటే, వెంటనే ఆయా ప్రదేశాలలో వాస్తు ప్రకారం, వాస్తు నిబంధనల ప్రకారం అక్వేరియంని ఉంచండి.

హాయిగా ఉండండి. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారికి చక్కటి పరిష్కారం అక్వేరియం.

వాస్తు ప్రకారం తొలగించటానికి వీలు లేని బరువైన ప్రదేశాలున్నాయంటే అక్కడ దోషాలు దోబూచు లాడుతుంటాయి.

అలాంటి చోట అక్వేరియం ఉంచండి అన్నీ అవే సర్దుకుపోతాయి. వరండాలో నైరుతీ దిశలో అక్వేరియం పెట్టాలనుకునేవారు వాస్తు పండితుల సలహా తీసుకోండి.

మొత్తానికి అక్వేరియంను సరైన రీతిలో, సరైన విధంగా ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల సంపద, ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది.

courtesyhttps://www.facebook.com/AstrologyInTelugu/photos/a.233540686797325.1073741828.214279525390108/534388960045828/?type=3&theater

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here