షుగర్ వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం ఎలా? | Early Signs of Diabetes in Telugu

4
44445
diabetes symptoms
షుగర్ వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం ఎలా? | Early Signs of Diabetes in Telugu

షుగర్ వ్యాధి రాబోయే ముందు తెలుసుకోవడం, అది వస్తున్నదనే హెచ్చరికలు అనేకం మన శరీర మీద కన్పిస్తాయి .

మనం వాటిని సాధారణంగా పట్టించుకోం. ఏ జ్వరనికో , నొప్పులకో డాక్టర్ దగ్గరికో వెళ్ళినప్పుడు ఆయన అన్ని పరిక్షలు చేసి మీకు షుగర్ వుంది అని తెలుస్తుంది .

అంతే తప్ప ముందుగా ఎవరు పరిక్ష చేసుకోవడం జరగదు . వ్యాది ముదిరే వరకు మనకు తెలియదు. కాని జాగ్రత్తగా గమనిస్తే మన ఆరోగ్యంలో కొద్ది పాటి తేడాలు వలన ప్రతి వ్యక్తి ముందుగా గమనించవచ్చు.

 1. ఆరికాళ్ళు మంటలు గా వుండటం
 2. శరీరం జిడ్డుగా ఉండటం
 3. శరీరం బరువు గా వుండటం
 4. మూత్రం తెల్లగా, తియ్యగా, చీమలు పట్టడం 
 5. ఆయాసం ,అలసట ,బడలికగా ఉండటం 
 6. ఎంత నీరు త్రాగిన దాహంగా ఉండటం 
 7. శరీరం లోని దుర్వాసన ఎక్కువగా ఉండటం 
 8. కొద్ది కొద్దిగా ఊపిరి ఎక్కువ సార్లు పీల్చుకోవడం 
 9. నోట్లో పాచి ఎక్కువగా రావడం 
 10. జుట్టు కొబ్బరి పిచులా గరుకుగా ఉండటం 
 11. కాళ్ళు , చేతులు తిమ్మెర్లు రావడం 
 12. మూత్రం పోసిన చోట చీమలు, ఈగలు పట్టడం

మధుమేహానికి… ఆహార అలవాట్లకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా వంటలకు ఉపయోగించే నూనెలను ద్రవ రూపంలో మాత్రమే వాడాలి. వనస్పతి,నెయ్యి వంటి వాటిని పూర్తిగా మానేయాలి. కనోలా,ఆలివ్, గ్రేప్ సీడ్ నూనెలను ఎంచుకోవాలి.

కొవ్వు లేని పాలు, పెరుగు వాడాలి. పనీర్ కి బదులు సోయా పనీర్ వాడటం అలవాటు చేసుకోవాలి. నూనెలో వేగించిన పదార్దాల జోలికి అసలు వెళ్ళకూడదు. నీటిలో లేదా ఆవిరి మీద ఉడికించిన ఆహార పదార్దాలను తినాలి.

మాంసాహారులు అయితే చికెన్ చర్మాన్ని తొలగించి ఆ తర్వాత వండుకోవాలి. మాంసాహారం వండుకొనేటప్పుడు పైకి కనిపించే కొవ్వును తొలగించాలి.

వండిన మాంసాహారాన్ని ఫ్రిడ్జ్ లో ఒక గంటసేపు ఉంచితే కొవ్వు పైకి తేలి గట్టిపడుతుంది. అప్పుడు దాన్ని సులభంగా తీసివేయవచ్చు.

అలాగే మధుమేహం ఉన్నవారిలో రక్తపోటువచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి.

దానికి బదులుగా పుదినా, కసూరి మేతి, దాల్చిన చెక్క పొడి వంటి వాటిని ఉపయోగించవచ్చు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here