సిగరెట్లు మానడం ఎలా? | how to stop smoking cigarette in Telugu

0
8780
how to stop smoking
సిగరెట్లు మానడం ఎలా? | how to stop smoking cigarette in Telugu

how to stop smoking / సిగరెట్లు మానడం ఎలా?

సిగెరెటు అలవాటు కొంతమంది కావాలని చేసుకోకపోయినా సరే సరదాగా కాల్చడం వల్లనో, ఊరికినే వస్తోంది గదా అనో, స్నేహితుల ముందు గొప్పలు పోవడానికి ఎందుకో ఒకందుకు సిగెరెటు అలవాటు చేసుకొంటారు.

ముందు అలవాటు చాలా సులభంగా తెలియకుండా అలవాటు అయిపోతుంది. కాని తర్వాత తర్వాత మానేయాలంటే కష్టాలు మొదలుఅవుతాయి. మానేయాలనే ఉంది కాని..

అంటూ నసగుతారు. అలాంటి వారు కూడా మానేయాలనుకొని నిక్కచ్చిగా, మానేసిన ఏ దుర్వసనానికి దగ్గరకు చేరనీయని వారు విజయలు అయినట్టే కదా.

అందుకే సిగెరెటు మానేద్దాం అని అనుకుని కూడా మానేయలేకపోతున్నవారికోసం సిగిరెటు మానడంలో విజయం సాధించిన వారు మిగతా వారికోసం కొన్ని చిట్కాలు చెప్తున్నారు ఇలా చేసి మీరు చూడండి.

  • ఎందుకు మానాలానుకుంటున్నారో నిజాయితీగా, తీరికగా, బాగా ఆలోచించి, ఒక పట్టిక తయారు చేసుకోండి. ప్రతిరోజూ రాత్రి పడుకు బోయేముందు వీటిల్లో ఒక్కో కారణాన్నీ పది సార్లు మననం చేసుకోవాలి. మానడం కష్టమేమో, మానడం అసాధ్యమేమో అనే నిరాశాపూర్తి ఆలోచనలకుఅసలు రానివ్వకండి.
  • ఆరోగ్యం చెడిపోవడం, ఇతరులకు ఇబ్బందిని కలి గించడం వంటి కారణాలను అటుంచీ, మీ మటుకు మీకు సిగరెట్లు మానడానికి ఒక బలమైన కారణం అంటూ ఉంటుంది. దానిని గుర్తించండి. ఉదాహరణకు, చేసే పనిని మధ్య మధ్యలో సిగరెట్లు తాగడం కోసం ఆపుతూ ఉండటం, లేదా సిగరెట్ల కోసం బయటకు వెళ్లాల్సి రావడం, లేదా ఎప్పడూ సిగరెట్ లైటర్ కోసమో, అగ్గిపెట్టె కోసమో వెదుకుతూ చిరాకును తెప్పించుకోవటం వంటివి.
  • సిగరెట్లు మానడానికి ఒక ప్రధానమైన రోజును నిర్ణయించుకోవాలి. అది మీ జన్మదినం కావచ్చు. మీ పాపాయి పుట్టినరోజు కావచ్చు. లేదా మీ పెళ్లిరోజు కావచ్చు. ఒకవేళ మీరు పని ఒత్తిడిలో సిగరెట్లు తాగుతున్నట్లయితే ఇంట్లో విశ్రాంతిగా గడిపే సమయంలోనైనా తాగకుండా ఉండాలి. మళ్లీ మీరు పనిలోకి వెళ్లే సమయానికి సిగరెట్లు తాగకుండా గడిపిన అనుభవం మీకు సహాయకారిగా ఉంటుంది. ఎంతటి అవాంతరం ఎదురైనా సరే, ఎంతటి ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనా సరే మీరు అనుకున్న రోజుని మార్చకండి.
  • సిగరెట్లు మానడమనే విషయం గురించి మీకు బాగా దగ్గరైన స్నేహితుడితో పందెం కట్టండి. ప్రతిరోజూ సిగరెట్ల కోసం వెచ్చించే ధనాన్ని తీసి పక్కన పెడుతుండాలి. ఒకవేళ ఏదన్నా సందర్భంలో సిగరెట్ తాగాల్సి వచ్చినా, సిగరెట్ మానడమనే పట్టుదలను గాలికి వదిలేయకండి. ఇంకా బలంగా నిర్ణయం తీసుకొని తిరిగి అదే పట్టుదలను కొనసా గించండి. వీలైతే ఒకవేళ మీ స్నేహితుడికి కూడా సిగరెట్లు తాగే అలవాటుంటే అతడిని కూడా మీతోపాటు మానేయమని ప్రోత్సహించండి. తాగడానికి స్నేహితులు ఎలాగైతే కారణమవతారో, మానడానికి కూడా అలాగే కారణమవు తారు.
  • సిగరెట్ ని పూర్తిగా కాకుండా సగమే తాగి పారేయండి. ఆరోగ్యాన్ని కొంతవరకైనా పరిరక్షించుకోవచ్చు.
  • ప్రతిరోజూ మీరు తాగే మొదటి సిగరెట్ ని ఒక గంట చొప్పున తాత్సారం చేయండి.
  • యాష్ ట్రేని ఖాళీ చేయకండి. యాష్ ట్రేలో పేరుకుపోయిన సిగరెట్ల పీకలు, వాటి వాసన మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేస్తాయి. దీంతో సిగరెట్లు తాగాలనిపించదు. (కప్పులో సగం వదిలేసిన, చల్లారిన టీ చూస్తే ఎవరికి తాగాలనిపించదు. గమనించారా? ఇదీ అలానే. ఇలానే పొగ తాగే అలవాటును నెమ్మది నెమ్మదిగా రోజుకు ఒక సంఖ్య తగ్గిస్తూ వచ్చి పూర్తిగా మానేయండి. ఆరోగ్యం పొందండి.

-డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్
రక్ష ఆయుర్వేదిక్ సెంటర్
హైదరాబాద

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here