Worship Ganapat
గణపతి ఆరాధన ఎలా చేయాలి?
గణపతి ప్రతిమ లేని ఇల్లు ఉండదు. ఈ ప్రతిమలు రకరకాల రంగులలో, భిన్న ఆకృతులతో మనకి లభ్యమవుతున్నాయి.
ఇలా లభ్యమైన గణపతుల్ని ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టం గా ఇళ్ళలో అలంకరించుకొంటారు. వాటిని సరైన సమయంలో , సరైన దిశలో అలంకరించుకొంటే అన్ని విధాల మంచి జరుగుతుంది.
ఉత్తర దిశ వైపు ఉంచే గణపతి ఆకుపచ్చ రంగులో ఉండడం మంచిది, అలాగే దక్షిణ దిక్కులో ఉండే గణపతి పగడం లేదా ఎరుపు రంగులో ఉండడం, తూర్పు దిశ లో ఉండే గణపతి స్పటికం లేదా చలువరాతితో ఉండడం, పశ్చిమంలో నీలం రంగులో ఉండే గణపతి మూర్తులను ఉంచడం మంచిది.
వాస్తు దోషాలు తొలగడానికి ప్రత్యేకం గా గణపతులను స్థాపించడం చూస్తూ ఉంటాం, ఈ ప్రతిమలని ఎక్కడ ఎలా స్థాపిస్తే ఎటువంటి విశేషముంటుందో తెలుసుకొందాం
వక్ర తుండ గణపతి – తుండం ఎడమ వైపు కు తిరిగి ఉన్న గణపతి రూపం ప్రాముఖ్యవహిస్తుందని ఒక ప్రతీతి. ఈ రూపం గల ప్రతిమను ఇంటి ముఖద్వారం పై ప్రతిష్టించడం వలన సకారాత్మ శక్తి సంచారం జరుగుతుంది.
కొందరు ఇటువంటి మూర్తి ని ఇంటి మధ్యలో అంటే బ్రహ్మ స్థానం లో ప్రతిష్టిస్తారు, దీనివలన ఇంట్లో సకారాత్మక శక్తి స్థిరంగా ఉంటుంది.
ఇంటి వాతావరణం లో కూడా సమతౌల్యం ఏర్పడుతుందని నమ్మకం. పసుపు రంగుతో ఉండడం మరీ విశేషం గా పరిగణించబడింది.
ఏకదంతం గణపతి – ఏకదంతం ఉన్న స్వరూపం గల గణపతి ని ప్రతిష్ఠిస్తే నకారాత్మక శక్తి నశించి ధన వృద్ది కలగడమే గాక కుటుంబం లో సమస్యలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి, మంచి ఆలోచనలు , బుద్ది వికాసం ఏర్పడతాయి.
మహోదర గణపతి – ఈ మూర్తి ని ఇంటి మధ్య భాగం లో ప్రతిష్టించడం వలన నకారాత్మక శక్తి ని తొలగిపోతుంది.
దృష్టి దోషం తొలగి విఘ్నాలు నివారింపబడతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
గజానన గణపతి – ఈ మూర్తి ని ప్రతిష్టించడం వలన ఆధ్యాత్మిక శక్తి వృద్ది చెంది , కుటుంబం లో సభ్యుల లో పరస్పర స్నేహభావం, ప్రేమానురాగాలు ఏర్పడతాయి.
గజానన ముఖం లోని పొడవైన తుండం, పెద్ద చెవులు లోభాన్ని త్యజిస్తాయి, అలాగే ముందుచూపు ని పెంచుతుంది. చిన్న కళ్ళు బుద్ది తీక్షత ను వృద్ది చేస్తాయి.
గజ ముఖం శాంతి ని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. యంత్ర, మంత్ర సాధనలలో ఈ స్వరూపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
లంబోదర గణపతి – పెద్ద పొట్ట గల మూర్తి ని స్థాపించడం వలన ఇంటిని విశాలం గా, స్వచ్చంగా ఉంచే ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. క్రోధాన్ని నిరోధించగలిగే శక్తి కలుగుతుంది.
వికట గణపతి – వికట గణపతి మూర్తి ని ని భవన నిర్మాణం లో ముఖ్యం గా వాడతారు. ముఖద్వారం అంతిమ ద్వారం, శౌచాలయం నిర్ణయించి నిర్మించటానికి సహకరిస్తుంది. దిశానిర్దేశానికి చక్కగా ఉపయోగపడుతుంది.
విఘ్న గణపతి – చేతిలో కమలం ఉన్నటువంటి గణపతి ని ప్రతిష్టించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి. ఈ మూర్తి శక్తి ని ఉత్పన్నం చేయగల సమర్ధత కలిగి ఉంటుంది. ఆపదలు తొలగి పోతాయి.
ధూమ్రవర్ణ గణపతి – ఈ మూర్తి ని ప్రతిష్టించడం వలన రాహుగ్రహ శాంతికి ఉపయోగపడుతుంది. ముఖద్వారం పై ఈ ప్రతిమ ఉంటే అనిష్ట గ్రహాలను శాంతింపజేసి సుఖ వృద్ది కి తోడ్పడుతుంది.
Vinayaka Chaviti Festival Related Posts
వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu
శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?
Good ; this arrival very useful for all nice collection
good thinking usefull to all
గణపతిని ఎలా పూజించాలి,నియమాలు,మొదలగు వి
వరాలతోపాటు,గణపతి షోడశ నామాలు ఒకో నామము
ఒకో ఫలితము ఇస్తుంది ఆ వివరాలు కూడ తెలియ
చేయగలరు