విష్ణుసహస్రనామాల్ని భీష్ముడు చెప్తుంటే ధర్మరాజాదులు ఎవరూ రాసుకోలేదు మరి ఎలా ప్రచారం పొంది మనవరకూ అందింది?

0
796

విష్ణుసహస్రనామాల్ని భీష్ముడు చెప్తుంటే ధర్మరాజాదులు ఎవరూ రాసుకోలేదు. వారు కేవలం శ్రద్ధగా విన్నారు, అంతే. అలాంటప్పుడు విష్ణుసహస్రనామస్తోత్రం ఎలా ప్రచారం పొంది మనవరకూ అందింది?

1940 ప్రాంతంలో కంచిపరమాచార్యస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తూ ఈ ప్రశ్నే అడిగాడు. అప్పుడు స్వామివారు సమాధానం ఇలా చెప్పారు –

భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుణ్ణి స్తుతిస్తున్నపుడు పాండవులూ, వ్యాసుడూ మొదలైనవారు శ్రద్ధగా విన్నారు కానీ, ఎవరూ రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు కృష్ణునితో “ఈ వేయినామాలు మనమంతా విన్నాం. కానీ రాసుకోలేదు. మళ్లీ ఈ నామాలను మనం పారాయణం చేయాలంటే ఎలా! ఆ సహస్రనామాలు మనందరికీ కావాలి, కనుక ఏం చేయాలి?” అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు – ‘ఆ సహస్రనామాలు మళ్లీ మనకు కావాలంటే వాటినివ్యాసుడు, సహదేవుడే చెప్పాలి’ అన్నాడు.

అప్పుడు అక్కడివారందరూ ‘అదెలా!?” అన్నారు. అపుడు కృష్ణుడు ఇలా చెప్పాడు – ‘మనందరిలో సహదేవుడు ఒక్కడే సూతస్ఫటికం వేసుకున్నాడు. ఆ స్ఫటికం మహేశ్వర స్వరూపం. దాని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్దతరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది” అన్నాడు. కృష్ణుడు సహదేవుని విష్ణుసహస్రనామాలను అందించమని అడిగాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞమేరకు, సహస్ర నామ శబ్దతరంగాలు వచ్చిన చోట- అనగా- భీష్మునికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసుడు కూర్చొని, ఆ సహస్ర నామశబ్దతరంగాలు పునఃప్రసారం (రీప్లే) అవుతుంటే వ్యాస మహర్షి గ్రంథస్థం చేశాడు. సహదేవుని ద్వారా విష్ణుసహస్ర నామాలు పరంపరగా మనవరకూ అందాయి.

మరణించాక ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో పునర్జన్మ పొంది ఉంటాడు కదా! అలాంటప్పుడు ఇంకా ఆబ్దికాలెందుకు?