లాలాజలం వలన ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా?

1
13099

saliva

లాలాజలం భగవంతుడు మనకు ప్రసాదించిన అద్భుత వరం. మనకే కాదు జంతువులకు కూడా ఇది అద్భుత ఔషధమే. జంతువులకు గాయాలు తగిలితే అవి డాక్టర్ దగ్గరకు పోలేవుకదా. అవి తమ నాలుకతో గాయాన్ని నాకుతాయి. గాయాలు మానుతాయి. మానవులకు కూడా ఇది వర్తిస్తుంది కానీ నాలుకతో నాకవలసిన అవసరంలేదు. నోటిలోని లాలాజలాన్ని చేతితో తీసి గాయం మీద పూయండి. ఎంత త్వరగా మానుతుందో చూడండి.

కండ్లకలక వస్తే చాలా బాధగా ఉంటుంది. కండ్లకలక వస్తే కళ్ళు ఎర్రగా మారడం, మంటలు జిలలు విపరీతమైన బాధఉంటుంది. నోటిలో లాలాజలాన్ని కళ్ళకు కాటుకలాగా పెట్టండి. ఒక్కరోజులో ఎర్రదనం తగ్గుతుంది, మంటలు, జిలలు తగ్గుతాయి.

ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కళ్ళద్ధాలు పెట్టకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పిల్లలకు రోజూ ఉదయంలేవగానే వారినోటిలోని లాలాజలం వారికంటికి కాటుకలాగా పెట్టండి. ఇలా మూడునెలలు చేస్తే పిల్లలు కళ్ళద్ధాలు పెట్టుకునే అవస్థ తప్పుతుంది. అతిభయంకరమైన చర్మవ్యాధులు కూడా లాలాజలం పూయడం వలన నయమౌతాయి. సొరియాసిస్ కూడా నయమైన సంఘటనలు నేను చూశాను.

భగవంతుడు మన నోట్లోనే మన జబ్బులకు ఔషధాన్ని ఏర్పాటుచేశాడు. ఇంత గొప్ప ఔషధన్ని మన అలవాట్లవల్ల ఉమ్మి, ఉమ్మి వృధా చేసుకుంటున్నాం. ఈ ఉపచారం చెబితే చాలామంది నవ్వుకోవచ్చు. చాలామంది అసహ్యంగా అనుభూతి చెందవచ్చు కానీ ఇది స్వతఃసిద్దంగా భగవంతుడు మన నోట్లో ఏర్పాటుచేసిన ఔషధం. ఈ వైద్యంతో భయంకరమైన కంటి జబ్బులుకూడా నయమైన సంఘటనలు నాకు తెలుసు.

ఇలా ఎన్నో సులభమైన ఉపాయాలు మన పెద్దలు మనకందించారు. కానీ మన తరంనుండి ఈవిజ్ఞానం మన తరువాతి తరానికి చేరకుండా పోతుంది.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here