పెళ్లి కానీ స్త్రీలు చదవవలసినది——? | Hymns for Unmarried Woman in Telugu

0
7935
unmarried indian girl
పెళ్లి కానీ స్త్రీలు చదవవలసినది——? | Hymns for Unmarried Woman in Telugu

రాజీవలోచనుఁడు హరి
రాసమూహముల గెల్చి రాజస మొప్పన్
రాజిత యగు తన పురికిని
రాజాననఁ దెచ్చె బంధురాజి నుతింపన్.

అంత నయ్యాదవేంద్రుని నగరంబు సమారబ్ద వివాహకృత్యంబును బ్రవర్తమాన గీత వాద్య నృత్యంబును, బ్రతిగృహాలంకృత విలసితాశేష నరనారీ వర్గంబును, బరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజఘటా గండమండల దానసలిలధారా సిక్త రాజమార్గంబును బ్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక కదళికా కర్పూర కుంకుమాగరు ధూపదీప పరిపూర్ణకుంభంబును, విభూషిత సకల గృహవేదికా కవాట దేహళీ స్తంభంబును, విచిత్ర కుసుమాంబర రత్నతోరణ విరాజితంబును, సముద్ధూత కేతన విభ్రాజితంబును నై యుండె; న య్యవసరంబున.

ధ్రుకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
గాంభీర్య విహారిణిన్ నిఖిల సంత్కారిణిన్ సాధు బాం
సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్.

తులుం దారును బౌరులు
హిమతిఁ గానుకలు దెచ్చి యిచ్చిరి కరుణో
న్న వర్ధిష్ణులకును మా
ని రోచిష్ణులకు రుక్మిణీకృష్ణులకున్.

రి పెండ్లికిఁ గైకేయక
కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్
మానందముఁ బొందిరి
ణీశులలోన గాఢ తాత్పర్యములన్.

రి యీ తెఱఁగున రుక్మిణి
రుదుగఁ గొనివచ్చి పెండ్లియాడుట విని దు
ష్కకృత్య మనుచు వెఱగం
దిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్.

నఘ! యాదిలక్ష్మి యైన రుక్మిణితోడఁ
గ్రీడ సలుపుచున్న కృష్ణుఁ జూచి
ట్టణంబులోని ప్రజ లుల్లసిల్లిరి
ప్రీతు లగుచు ముక్తభీతు లగుచు.”

అని చెప్పి.

కులయరక్షాతత్పర!
కులయదళ నీలవర్ణ కోమలదేహా!
కులయనాథ శిరోమణి!
కులయజన వినుత విమలగుణ సంఘాతా!

సిజనిభ హస్తా! ర్వలోక ప్రశస్తా!
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ!
హృదయ విదారీ! క్తలోకోపకారీ!
గురు బుధజన తోషీ! ఘోరదైతేయ శోషీ!

ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీమహాభాగతం బను మహాపురాణంబు నందు దేవకీదేవి వివాహంబును; గగనవాణీ శ్రవణంబును; గంసోద్రేకంబును; వసుదేవ ప్రార్థనయును; యోగమాయా ప్రభావంబును; బలభద్రుని జన్మంబును; బ్రహ్మాది సుర స్తోత్రంబును; గృష్ణావతారంబును; ఘోష ప్రవేశంబును; యోగనిద్రా చరితంబును; నంద పుత్రోత్సవంబును; బూతనా సంహారంబును; శకట భంజనంబును; దృణావర్తు మరణంబును; గ ర్గాగమనంబును; నారాయణాది నామ నిర్దేశంబును; బాలక్రీడయును; మృ ద్భక్షణంబును; వాసుదేవ వదనగహ్వర విలోక్యమా నాఖిల లో కాలోకనంబును; నవనీత చౌర్యంబును, యశోదా రోషంబు; నులూఖల బంధనంబు; నర్జునతరుయుగళ నిపాతనంబును; నలకూబర మణిగ్రీవుల శాప మోక్షణంబును; బృందావన గమనంబును; వత్స పాలనంబును; వత్సాసుర వధయును; బకదనుజ విదారణంబు; నఘాసుర మరణంబును; వ త్సాపహరణంబును; నూతన వత్స బాలక కల్పనంబును; బ్రహ్మ వినుతియు; గో పాలకత్వంబును; గార్దభాసుర దమనంబును; కాళియ ఫణి మర్దనంబును; గరుడ కాళియ నాగ విరోధ కథనంబును; బ్రలంబాసుర హింసనంబును; దవానల పానంబును; వర్షర్తు వర్ణనంబును; శరత్కాల లక్షణంబును; వేణు విలాసంబును; హేమంత సమయ సమాగమంబును; గోపక న్యాచరిత హవిష్య వ్రతంబును; గాత్యాయనీ సేవనంబును; వల్లవీ వస్త్రాపహరణంబును; విప్రవనితా దత్తాన్న భోజనంబు; నింద్రయాగ నివారణంబును; నంద ముకుంద సంవాదంబును; పర్వత భజనంబును; బాషాణ సలిల వర్షంబును; గోవర్ధ నోద్ధరణంబును; వరుణకింకరుండు నందుని గొనిపోయిన హరి తెచ్చుటయును; వేణు పూరణంబును; గోపికాజన ఘోష నిర్గమంబును; యమునాతీర వన విహరణంబును; గృ ష్ణాంతర్ధానంబును; ఘోషకామనీ గ ణాన్వేషణంబును; గోపికా గీతలును; హరి ప్రసన్నతయును; రాస క్రీడనంబును; జలకేళియును, సర్పరూపకుం డైన సుదర్శన విద్యాధరుండు హరిచరణ తాడనంబున నిజరూపంబు పడయుటయును; శంఖచూడుం డను గుహ్యకుని వధించుటయును; వృషభాసుర విదళనంబును; నారదోపదేశంబున హరి జన్మకథ నెఱంగి కంసుండు దేవకీవసుదేవుల బద్ధులం జేయుటయును; ఘోటకాసురుం డైన కేశియను దనుజుని వధియించుటయును; నారద స్తుతియును; వ్యోమదానవ మరణంబు; నక్రూ రాగమంబు; నక్రూర రామకృష్ణుల సల్లాపంబును; ఘోష నిర్గమంబును; యమునా జలాంతరాళంబున నక్రూరుండు హరి విశ్వరూపంబును గాంచుటయు; నక్రూర స్తవంబును; మథురానగర ప్రవేశంబును; రజక వధయును; వాయక మాలికులచే సమ్మానంబు నొందుటయును; కుబ్జా ప్రసాద కరణంబును; ధను ర్భంగంబును; గంసు దుస్వప్నంబును; గువలయాపీడ పీడనంబును; రంగస్థల ప్రవేశంబును; జాణూర ముష్టికుల వధయును; గంస వధయును; వసుదేవదేవకీ బంధ మోక్షణంబు; నుగ్రసేను రాజ్య స్థాపనంబును; రామకృష్ణులు సాందీపుని వలన విద్య లభ్యసించుటయును; సంయమనీ నగర గమనంబును; గురుపుత్ర దానంబు; నుద్ధవుని ఘోష యాత్రయును; భ్రమరగీతలును; గు బ్జావాస గమనంబును; గరినగరంబునకు నక్రూరుండు చని కుంతీదేవి నూరార్చుటయును; గంసభార్య లగు నస్తి ప్రాస్తులు జరాసంధునకుఁ గంసు మరణం బెఱింగించుటయును; జరాసంధుని దండయాత్రయును; మథురానగర నిరోధంబును; యుద్ధంబున జరాసంధుండు సప్తదశ వారంబులు పలాయితుం డగుటయును; నారద ప్రేరితుండై కాలయవనుండు మథురపై దాడివెడలుటయును; ద్వారకానగర నిర్మాణంబును; మథురాపుర నివాసులం దన యోగబలంబున హరి ద్వారకానగరంబునకుం దెచ్చుటయును; కాలయవనుడు హరి వెంటజని గిరిగుహ యందు నిద్రితుండైన ముచికుందుని దృష్టి వలన నీఱగుటయును; ముచికుందుండు హరిని సంస్తుతి చేసి తపంబునకుం జనుటయును; జరాసంధుండు గ్రమ్మఱ రామకృష్ణులపై నేతెంచుటయును; బ్రవర్షణ పర్వతారోహణంబును; గిరి దహనంబును; గిరి డిగ్గనుఱికి రామకృష్ణులు ద్వారకకుం జనుటయును; రుక్మిణీ జననంబును; రుక్మిణీ సందేశంబును; వాసుదే వాగమనంబును; రుక్మిణీ గ్రహణంబును; రాజలోక పలాయనంబును;

రుక్మి యనువాని భంగంబును; రుక్మిణీ కల్యాణంబును యను కథలుఁ గల దశమస్కంధంబు నందుఁ బూర్వభాగము సమాప్తము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here