రథసప్తమి రోజున శిరస్సుపై జిల్లేడు ఆకులు పెట్టుకొని ఎందుకు స్నానం చేస్తారు? అలాగే రథ సప్తమి రోజున చిక్కుడు ఆకులతో రథం ఎందుకు చేస్తారు?

0
6014
ratha saptami bathing procedure and charriot
ratha saptami bathing procedure

రకరకాల పత్రాలలో రకరకాల ఫలాలలో రకరకాల ఔషధ శక్తులు ఉంటూ ఉంటాయి.  ఆ ఔషధ శక్తులను బట్టి వాటి వినియోగం ఉంటుంది. అలాగే వివిధ కాలాలలో వివిధ బుతువుల మార్పులలో ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూ ఉంటుంది.

1రథ సప్తమి స్నాన విధానం (Ratha Saptami Bathing Procedure)

అలా మనం గమనించినట్లెతే జిల్లేడుకి సంస్కృతంలో అర్కపత్రం అని పేరు. అర్క అంటేనే సూర్యుడి యొక్క పేర్లలో ఒకటి. సూర్యునిలో ఉన్నటువంటి ఆ తీశ్టమైన శక్తి విశేషం ఏదైతే ఉన్నదో అది అర్క పత్రంలో ఉన్నది. ఇది మనం భౌతిక శాస్త్రంతో నిరూపీంచలేకపోయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా దివ్యశక్తికీ, పత్రానికీ అనుబంధం ఉన్నది. అందుకే అర్క కుసుమాలతో, అర్క పత్రాలతో, అర్క మూలం అనగా వేరుతో భగవదర్భన చేయడం మనకి కనపడుతూంది. గణపతినీ అదేవిధంగా ఆంజనేయ స్వామి వారిని కూడా జిల్లేడు మూలంతో జిల్లేడు చక్కతో విగ్రహం చెక్కి పూజించడం కనపడుతున్నది. జిల్లేడుకి, సూర్యభగవానుడికీ సంబంధం ఉన్నది. చిత్రమేమిటంటే మన ఆధ్యాత్మ శాస్తానికీ, ఆయుర్వేద శాన్తానికీ పరస్పర సమన్వయము ఉంది. అలాగే సౌరశక్తి విశేషం కలిగినటువంటి ఈ అర్కపత్రాన్ని శిరస్సుపై పెట్టుకొని స్నానం చేయడం వల్ల శుద్ధత లభించి సౌరశక్తి విశేషం వల్ల వర్భస్సు వస్తుందీ అని ఓక భావం.

Back