కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి?

0
4892

importance-of-river-bath-in-kartika-masam-hariome-hariomమన పూర్వీకులు మనకేర్పరచిన ఆచార సంప్రదాయాల వెనుక ఏదో ఒక మానవ ప్రయోజనం దాగి ఉంటుంది. మన శాస్త్రాల ప్రకారం… ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధరిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారు ప్రకృతిలో ఒకోసారి ఒకో రూపంలో కనిపిస్తూ ఉంటుంది. చైత్రమాసం లో వేప పువ్వు రూపంలో, కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ, ఉసిరికాయ రూపంలోనూ, ఆషాడ మాసంలో గడ్డిపరక రూపంలోనూ  అందరినీ రక్షిస్తూ ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవటం మంచిదని మన పెద్దలు చెబుతారు.

Back

1. ఎందుకు చేయాలి?

మాసాలన్నింటిలోనూ కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని, ఆ మాసంలో నదీ స్నానం చేసి తీరాలని మన పూర్వీకులు తెలిపారు. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది… పరోక్షంగా  గలగలమని ప్రవహించే నదే. ప్రవహించే నదిని గమనిస్తే…. అది రకరకాల శబ్దాలు చేస్తూ, తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ ప్రవహిస్తుంది. ఆ సమయంలో అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అలా ప్రవహించే నదిలోని నీరు పై చంద్రకిరణాలు పడటం ద్వారా ఈ నీరు చంద్రుడి శక్తిని పుచ్చుకుంటాయి.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here