తులసి అంటే మనం పూజచేసి దణ్ణం పెట్టుకోవటం, తీర్థంలో తులసి వేసి లోపలికి పుచ్చుకోవటమే తెలుసు కొందరికి. కానీ తులసి ఆరోగ్య ప్రదాయిని అని, తులసివల్ల చాలా లాభాలు ఉన్నాయని కానీ కొంతమందికి తెలియవు. మన పెద్దలు వీటివల్ల లాభాలు తెలుసుకుని మనకి చెప్పి ఉన్నారు. పెరట్లో ఉన్న తులసి మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలిస్తే మరికొంచం శ్రద్ధగా నీళ్ళు పోసి పెంచుకుంటాము.