వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance in Telugu

0
6031
వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance in Telugu
Vaishakha Masam Importance in Telugu

వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance in Telugu

2. వైశాఖ మాస ప్రత్యేకత ఏమిటి?

వైశాఖ మాసం మొదలుకొని మరో మూడు మాసాల వరకూ శ్రీ మహా విష్ణువు భూ సంచారానికి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వైశాఖ మాసం సకల పూజలకూ సర్వోత్తమమైన మాసము. ఈ మాసంలో ఎన్నో పర్వదినాలు వరుసగా వస్తాయి. వైశాఖ శుక్ల తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు పరశురామ జయంతి. అనగా విష్ణువు పరశురాముని అవతారాన్ని ధరించిన రోజు. వైశాఖ తదియ నాడు బదరీ నారాయణుడి ఆలయం తలుపులు తెరుస్తారు. వైశాఖ పంచమి రోజు ఆదిశంకరుల జయంతిని పండుగలా జరుపుకుంటారు. శ్రీ మహా విష్ణువు నరసింహుని రూపంలో అవతరించిన రోజు వైశాఖ శుక్ల చతుర్దశి. ఈ పర్వదినాన్ని నృసింహ జయంతిగా జరుపుకుంటారు. వైశాఖ శుద్ధ పౌర్ణమి బుద్ధ భగవానుడి జన్మదినం. వైశాఖ బహుళ దశమిని హనుమజ్జయంతిగా జరుపుకుంటారు.

ఈ మాసంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఇంకా రామానుజ జయంతి, సంపద్ గౌరీ వ్రతం మరియు సత్యనారాయణస్వామి కల్యాణం ఈ మాసంలోనే వస్తాయి. ఇన్ని పర్వదినాలు కలిగిన అత్యంత శుభప్రదమైన మాసం వైశాఖ మాసం.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here