
Ayurveda Tips To Prevent WhiteHair / ఆయుర్వేదం పరంగా తెలుపు జుట్టు నివారించడానికి చిట్కాలు
ఎండు ఉసిరి ఒక కప్పు , రెండు కప్పుల పెరుగు తీసుకుని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానపెట్టాలి . మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి . ఇలా వారానికి ఒక సారి క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది
ఒక కప్పు ఎండు ఉసిరిని నాలుగు కప్పుల నీళ్ళల్లో వేసి చిటికెడు పంచదార కలిపి మరిగించాలి . ఈ మిశ్రమం ఒక కప్పు మోతాదుకు వచ్చిన తరువాత ఇందులో రెండు కప్పుల హెన్నా పొడి , గుడ్డు సోన , నిమ్మరసం కలపాలి . ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల తరువాత తల స్నానం చేయాలి .
సరిపడా హెన్నా, గుడ్డు సోన, అర చెక్క నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఇన్ స్టంట్ కాఫీ పొడి వేసీ బాగా కలపాలి . ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 45 నిమిషాలా తరువాత కడిగేయాలి .
Good
Excelent message
Very use ful methods