ఈ రోజు కధ – తెలివి | Story Tale of Intellect in Telugu

0
4667
bat
Intellect Story

Intellect Story

పూర్వం ఒకప్పుడు ఒక నక్క గబ్బిలాన్ని పట్టుకుంది. దానిని చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు గబ్బిలం దీనాలాపంతో తనను చంపకుండా విడిచిపెడితే ఎంతైనా పుణ్యం ఉంటుందని వేడుకుంది.

నక్క పట్టిన పట్టు వీడకుండా “పక్షులంటే నాకు ఎంతో ఇష్టం. నేను పక్షులను అస్సలు విడిచిపెట్టను” అంది.

అప్పుడు గబ్బిలం “నక్క బావా! నేను పక్షిని కాదు. కావాలంటే నా వంటి మీద ఒక్క ఈక కూడా లేదు చూదు” అని తన శరీరం చూపించింది.

నిజమేననుకుని నక్క గబ్బిలాన్ని వదిలివేసింది. గబ్బిలం బ్రతుకు జీవుడా అని చెట్టుపైకి వెళ్ళి చెట్టు కొమ్మను పట్టుకుని వ్రేలాడుతూంది.

తిరిగి ఇంకో రోజున మరో నక్క ఈ గబ్బిలాన్ని పట్టుకుని చంపడానికి ప్రయత్నించింది. గబ్బిలం ప్రణభిక్ష పెట్టమని వేడుకుంది.

దానికి నక్క “నేను ఎలుకలను కనికరం చూపను, నిన్ను విడిచిపెట్టక మానను, చంపే తీరతాను” అంది. వెంటనే గబ్బిలం “అయ్యో పిచ్చిదానా! నేను అసలు ఎలుకనే కాదు, నేను పక్షిని.

కావాలంటే నా రెక్కలు చూడు” అని తన రెక్కలను టపటపా విదిల్చి చూపించింది. ఆ నక్క నిజమేననుకుని గబ్బిలాన్ని విడిచిపెట్టింది.గబ్బిలం చెంగున చెట్టు మీదికి వెళ్ళిపోయింది.

గబ్బిలం తను పక్షిగానీ, ఎలుకగానీ కాకపోవడంచేత రెండుసార్లు నిజమే చెప్పి మరణోపాయం నుంచి తప్పించుకుంది. రెండువైపులా వాడిగా ఉండడం ఎంతో మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here