అతి తక్కువ ఖర్చుతో 9 రోజుల పాటు ఆ పుణ్యక్షేత్రాల యాత్ర? | Bharat Gaurav Tourist Train Package

0
20480
Bharat Gaurav Tourist Train Details
Bharat Gaurav Tourist Train Ticket Cost & Feature Includes

Bharat Gaurav Tourist Train Details

2రోజు వారి టూర్ వివరాలు (Daywise Tour Details)

రోజు 1 (Day 1):

ఈ రైలు మొదటి రోజున మధ్యాహ్నం 12 గం.కు సికింద్రాబాద్‌లో బయల్దేరి కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగి అక్కడ ప్రయణికులను ఎక్కించుకుటుంది.

రోజు 2 (Day 2):

రెండవ రోజు పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో ఆగుతు ఉదయం మాల్తీపాత్‌పూర్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి పూరీకి బయల్దేరి, అక్కడి జగన్నాథ ఆలయ సందర్శన ఉంటుంది. ఈ రాత్రికి పూరీలోనెస్ బస ఉంటుంది.

రోజు 3 (Day 3):

మూడవ రోజు ఉదయం కోణార్క్ బయల్దేరి అక్కడి సూర్యదేవాలయాన్ని చూసిన తర్వాత గయ బయల్దేరుతుంది.

రోజు 4 (Day 4):

నాలుగవ రోజున గయ చేరుకోని అక్కడ పిండ ప్రదానం, విష్ణుపాద ఆలయ సందర్శన చేసుకున్న తర్వాత కాశీకి బయల్దేరుతుంది.

రోజు 5 (Day 5):

ఐదవ రోజు కాశీకి చేరుకోని అక్కడి విశ్వనాథ ఆలయం, వారణాసి కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయంలను దర్శించుకోని సాయంత్రం గంగా హారతి చూసుకున్న తర్వాత అయోధ్య బయల్దేరుతుంది.

మరిన్ని రోజు వారి టూర్ వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.