
black is inauspicious
1. నలుపురంగు గొప్పదనం
నలుపు అశుభానికి గుర్తన్న వాళ్ళే, నలుపు నారాయణ మెప్పు అన్నారు. రాముడినీ, కృష్ణుడినీ తప్ప నల్లగా ఉన్న వాళ్లందరినీ తక్కువగా చూస్తుంటారు.చర్మం దగ్గరి నుంచీ, వేసుకునే బట్టల వరకూ నలుపు రంగును చాలా మంది దూరంగా ఉంచుతారు. నిజానికి రంగులన్నీ కలిస్తే పుట్టేది నలుపు రంగే. CHROMATICS (వర్ణ శాస్త్రం) ప్రకారం నలుపు హుందా తనాన్నీ, అధికారాన్నీ సూచిస్తుంది. విష్ణు మూర్తి అవతారాలయిన రాముడు, కృష్ణుడు మాత్రమే కాదు పురాణాలలో అత్యంత సౌందర్య వతులయిన ద్రౌపది, శకుంతల వంటి వారు కూడా నల్లని మేనిఛాయను కలిగి ఉన్నవారే.
అయ్యప్ప స్వామి మాల ధారణకు నలుపూ రంగే వాడతారు. కొన్ని ప్రాంతాలలో అమ్మవారికి నల్లని చీరను ధరింపజేస్తారు. ఆలయానికి వచ్చిన స్త్రీలకు నల్లని గాజులను అమ్మవారి ప్రసాదంగా ఇస్తారు.
Promoted Content