మెటిక విరిస్తే నష్టం లేదు ? Is it harmful to crack your knuckles in Telugu?

0
1558
మెటిక విరిస్తే నష్టం లేదు ? Is it harmful to crack your knuckles in Telugu?

 Is it harmful to crack your knuckles .ఎవరైనా వేళ్లతో మెటికలు విరుస్తుంటే పెద్దవాళ్లు వెంటనే వద్దంటారు. అది మంచిది కాదని వారిస్తుంటారు. అది నిజంగా మంచిది కాదా? మెటిక విరిస్తే చేతి పట్టు తగ్గుతుందా? ఇవేవీ నిజం కాదని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. మెటికలు విరిచినప్పుడు అల్ట్రాసౌండ్‌ పరీక్షతో పరిశీలించగా.. చేతి సమస్యలేమీ తలెత్తటంలేదని, పైగా కదలికలు మెరుగుపడుతున్నాయని తేలింది. మెటిక విరిచినప్పుడు కీలులో హఠాత్తుగా మెరుపులాంటిది పుట్టుకొస్తున్నట్టూ బయటపడటం ఆశ్చర్యకరం. మెటిక విరుస్తున్నప్పుడు రెండు కీళ్ల ఉపరితలాలు దూరంగా జరిగి, కీలులో ఒత్తిడి తగ్గుతుంది. దీంతో అప్పటివరకు కీలు లోపలి ద్రవంలో కరిగిన వాయువు హఠాత్తుగా విడుదలై, బుడగలా ఏర్పడుతుంది. దీని మూలంగానే మెరుపు తలెత్తుతోందన్న మాట!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here