భక్తి మనసులో ఉంటే చాలదా? బైటకు ప్రదర్శించాలా?

0
860

Is devotion in the mind enough? Show off?Is Devotion in the Mind Enough? Show Off?

Is Devotion Generated in the Mind or Soul?

బొట్టు పెట్టుకోవడం, రుద్రాక్షలు, తులసి మాలలు వేసుకోవడం ‘ప్రదర్శన’ అనిపించుకోదా? భక్తి మనసులో ఉంటే చాలదా? బైటకు ప్రదర్శించాలా?

మనసులో ఉంటే తప్పకుండా బయట ఉంటుంది. శరీరాన్ని శుద్ధి చేసే విధానాల్లో ఇవి ఒకటి. వీటిని దైవ చిహ్నాలు, దైవ రక్షలు అంటారు. ఇవి ప్రదర్శన కోసం అనడం తగదు. అయితే కొందరు ఆడంబరం కోసం చేసి ఉండవచ్చు. కానీ అందరిదీ అదే పద్దతి అనడం తగదు కదా. సంఘం దృష్టిలో గౌరవంగా కనబడడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అలంకరించుకుంటారు. అలాంటి అలంకరణలో భాగంగా కొందరు దీన్ని భావించవచ్చు. 

శాస్త్ర రీత్యా – భ్రూమధ్యం జ్ఞానరూపుడైన దైవం యొక్క స్థానం. అక్కడ బిందురూపుడిగా భగవంతుని ధ్యానించే యోగ విధానమూ ఉంది. అలాగే రుద్రాక్ష, తులసి, స్పటికం – వీటి వైద్య మహిమలు కూడా ఇటీవల శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆధ్యాత్మికంగా కూడా ఈ చిహ్నాల ధారణ కచమవుతుందనీ, కనిపించని సూక్ష్మ జగత్తులో కూడా రక్షణనిస్తుందనీ మన పురాణాలు, మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. భక్తులైన వారికి దైవం పైనా, శాస్త్రం పైనా నమ్మకం ఉంటుంది. ఈ చిహ్నాల వల్ల దైవ కృప, దైవ చింతన నిరంతరం సన్నిహితమవుతుందని భక్తులు దీనిని ధరిస్తారు. అంతేకానీ ఆర్బాటం కోసం కాదు. బైట కనిపించేదంతా మనసులో ఉండకపోవచ్చు గానీ, మనసులో ఉన్నది మాత్రం బయట కనిపించి తీరుతుంది.

– బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు 

Related Posts:

నవవిధ భక్తి మార్గములు తెలుసా? Nine Ways Of Devotions in Telugu

మానసిక ఒత్తిడులను దూరం చేసుకోండి | How To Relieve Stress In Telugu

విష్ణుసహస్రనామాల్ని భీష్ముడు చెప్తుంటే ధర్మరాజాదులు ఎవరూ రాసుకోలేదు మరి ఎలా ప్రచారం పొంది మనవరకూ అందింది?

దానం ఎలా, ఏ విధంగా, ఎవరికి చేయాలి? How to Made Donations as per Hindu Vedas / Puranas

అమ్మవారి అనుగ్రహం కోసం ఏమి చేయాలి?

నిత్యపూజలో మొదటి పూజ ఎవరికి చేయాలా ? ఎందుకు చేయాలా ?

దేవాలయంలో చేయకూడని పనులు?

శ్లోకాలతో శనిదోష నివారణ చేసే ఉపాయం – Remedies for Shani Dosha

కుంకుమ కింద పడితే…

పడుకొనే గదిలో దేవుడి పటాలు ఉండవచ్చా?