
vastu shastra
ప్రపంచంలో ప్రతి మతానికి ఒక మతగ్రంథం వుంది. దానిలో చెప్పన విధంగా కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి. కాని ఏ మత ఆచారాలు ఆ మతానికి పరిమితం. కానీ ఏ మతం వారైనా ఇతర మతాల ఇష్టపూర్వకంగా పాటించవచ్చు. మన వాస్తుశాస్త్రం కూడా ఇటువంటిదే. హిందూ వాస్తుశాస్త్రానికి మతము, ప్రాంతము అని తేడా లేదు. విధిగా ఆచరించాలని చెప్పకపోయినా ఆచరిస్తే మంచిది. ప్రపంచంలో నిర్మించిన ప్రతి గృహము, కట్టడాలపై వాస్తుశాస్త్రం పనిచేస్తుంది.
శాస్త్రానుగుణంగా కట్టిన ఇళ్ళు వాటిలో నివసించేవారికి సకల సుఖాలూ ఇస్తాయి. ఇది నిరూపితం. వాస్తుశాస్త్రం పాటించకుండా కట్టిన ఇళ్ళలో తరచూ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఇంటి యజమాని గ్రహ గతులు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. కాబట్టి ఏ మతం వారైనా ఎటువంటి ప్రదేశంలోనైనా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవచ్చు. ప్రపంచ ప్రజలకు అనువైన ఇంట్లో సుఖంగా జీవించే మార్గం వాస్తుశాస్త్రం రూపంలో భగవంతుడు ఈ సృష్టికి ప్రసాదించాడని చెప్పవచ్చు. ఎవరి మత నియమాలకు అడ్డురాని ఈ వాస్తుశాస్త్రాన్ని అందరూ ఆచరించి సుఖపడాలని ఆశిద్దాం.