
Can Vitamin – C Cure Cold in Telugu విటమిన్ ‘సి’కి జలుబు తగ్గించే గుణం ఉందని మనం బలంగా నమ్ముతాం. ఇక నుంచి ఆ నమ్మకాన్ని కాస్తా సడలించుకోవాలేమో!
ఎందుకంటే విటమిన్ సి సమగ్ర ఆరోగ్య రక్షణకు అత్యవసరమే కానీ జలుబు రాకుండా చూస్తుందనేది అవాస్తవం అంటున్నాయి తాజా అధ్యయనాలు.
తక్కిన అత్యావస్యక విటమిన్ల మాదిరిగానే విటమిన్ సి పిల్లల ఎదుగుదలకి చాలా అవసరం. ఈ విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
ఆ క్రమంలో జలుబు చేసినప్పుడు ఆ తీవ్రతని తగ్గించి ఎక్కువ రోజులు జలుబు లేకుండా చేయొచ్చేమో కానీ అసలు రాకుండా చూస్తుంది అనేది సరైన అభిప్రాయం కాదట.
మరి విటమిన్ సి ఆవస్యకత ఏంటి అంటే… నాడీమండలం పనితీరు చురుగ్గా ఉండటంలో విటమిన్ సి కీలకపాత్ర పోషిస్తుంది.
విటమిన్ సి లోపం తలెత్తితే చర్మం బరకగా మారడం, చర్మం మొద్దుబారడం, భావోద్వేగాల్లో తీవ్రత వంటివన్నీ తలెత్తుతాయి.
ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే సి విటమిన్ అధికంగా ఉండే నారింజ, బత్తాయి వంటి పుల్లని పండ్లతో పాటూ రోజువారీ ఆహారంలో టొమాటో, మిర్చి వంటి వాటిని కూడా చేర్చుకోవాలి.
దాంతో విటమిన్ సి లోపం ఏర్పడకుండా ఉంటుంది.